పుష్ప, RRR, ఆచార్య : ఆర్టిస్ట్‌ సమంతా అద్భుతమైన పాట వింటే....

26 Apr, 2022 11:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారతీయ సినిమాలో గొప్ప గొప్ప సినిమాలన్నీ  ఆర్ట్‌ రూపంలో దర్శనమిస్తే ఎలా ఉంటుంది. వెండి తెరపై ఒక మూవీని అవిష్కరించే అన్ని క్రమాలను ఒక థీమ్‌గా ఎంచుకుని కళాకారులు పనిచేస్తే. ఈ ఆలోచనే అద్భుత కళాఖండాలను  వెలుగులోకి తీసుకొచ్చింది.  ప్రముఖ కార్టూనిస్టు, దర్శకులు బాపు, రమణలు సినిమా మొత్తాన్ని  పర్‌ఫెక్ట్‌గా బొమ్మలు గీసుకొని ఆ తరువాత సినిమా తీసేవారట.

అలాగే  తెలుగు, హిందీ భాషల్లో బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు, సినిమా తయారయ్యేందుకు సంబంధించి వివిధ దశలు, రంగాలు,  స్టార్‌ హీరోలు,  లెజెంట్రీ  నటీ నటుల పట్ల గౌరవ సూచకంగా ఆర్ట్‌ క్యూరేటర్‌ అన్నపూర్ణ మడిపడగ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో  ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌లో కొలువు దీరిన  వినూత్నమైన , అద్భుతమైన  చిత్రాలను ‘చిత్రం’  షోలో  చూద్దాం.


ఆర్టిస్టులు రకరకాల థీమ్‌లతో  బొమ్మలు వేయడం, వాటిని ప్రదర్శనకు పెట్టడం అందరికీ తెలుసు. ఇందులో ప్రతీ ఆర్టిస్టుకు వారికంటూ ఒక ప్రత్యేక శైలి( సిగ్నేచర్‌) ఉంటుంది. దాని ఆధారంగా తమ ప్రతిభకు అద్దంపడుతూ అద్భుతమైన ఆర్ట్స్‌ను  ప్రదర్శించారు.  వీటిని పరిశీలిస్తే.. ఇలా కూడా ఆర్ట్‌  వర్క్‌ను రూపొందించవచ్చా అని ఆశ్చర్యపోవడం మన వంతవుతుంది. అనేక ఆర్ట్‌ ఎగ్జిబిషన్స్‌ను సక్సెస్‌  చేస్తూ,  ఔరా అనిపించే ఎగ్జిబిషన్స్‌తో  ఆకట్టుకుంటూ, గొప్ప మహిళా ఆర్ట్‌ క్యూరేటర్‌గా పాపులర్‌ అయిన అన్నపూర్ణ మడిపడగ ఎగ్జిబిషన్‌ విశేషాలను సాక్షి.కామ్‌తో పంచుకున్నారు. 

భారతీయ సినిమాకు సంబంధించిన థీమ్‌తో దీన్ని రూపొందించడం విశేషం. సినిమాలోని 24 క్రాప్ట్స్‌ ఇన్‌స్పిరేషన్‌తో ఆ ఆర్ట్స్‌ను రూపొందించామని అన్నపూర్ణ వివరించారు. యాక్రిలిక్‌, ఆయిల్‌, వుడ్‌, సీడీలు, ఫ్లోర్‌ టైల్స్‌,  24 కారెట్స్‌  గోల్డ్‌,  పెన్సిల్‌ స్కెచ్‌, ఇలా విభిన్న మీడియమ్స్‌పై  దేశవ్యాప్తంగా 30 మంది  గొప్ప  గొప్ప ఆర్టిస్టులు ఇందులో పాల్గొన్నారని ఆమె తెలిపారు. ఈ ఎగ్జిబిషన్‌కోసం ఆర్టిస్ట్‌ల తపన గురించి వివరించారు. అలాగే కళకు జెండర్‌ లేదని, చాలామంది మహిళా ఆర్టిస్టులు కూడా అద్బుతమైన ఆర్ట్స్‌ రూపొందించారని  అన్నారామె.  అలాగే తమ ఎగ్జిబిషన్‌కు అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, రెండేళ్ల తమ శ్రమ ఫలించిందంటూ అన్నపూర్ణ సంతోషం వ్యక్తం  చేశారు. 

కోలకతా బైస్డ్‌   ఆర్టిస్ట్‌ దెబాషిస్‌ సమంత  బాలీవుడ్‌ లెజెండ్రీ మూవీ ‘పాకీజా’ కి  ట్రిబ్యూట్‌గా ఒక  కళాఖండాన్ని  రూపొందించారు.  అంతేకాదు తన అభిమాన  హీరోయిన్‌ మీనాకుమారీపై ప్రేమతో సమంతా పాట పాడి మరీ మ్యూజికల్‌ ట్రిబ్యూట్‌  అందించారు. 

సంవత్సరన్నర నుంచి 40 రోజుల పాటు శ్రమించి తమ బుర్రకు, కుంచెకు పదును పెట్టి అద్బుతమైన కళా ఖండాలను ప్రదర్శించారు. ముఖ్యంగా టాలీవుడ్‌ సెన్సేషన్‌ మూవీలు, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌, ఆచార్య థీమ్‌లను తీసుకుని  డిఫరెంట్‌ ఆర్ట్‌ వర్క్‌ తీర్చిదిద్దారు.  హ్యాండ్‌ మేడ్‌ పోస్టర్స్‌ థీమ్‌తో వీటిని ప్రదర్శించడం హైలైట్‌.


ఫస్ట్‌ విమెన్‌ ఆఫ్‌ ఇండియన్‌ విమెన్‌ అనే  కాన్సెప్ట్‌తో  సినిమా రంగంలో మహిళ సేవలకు గౌరవ  సూచకంగా నిలిచిన ఆర్ట్‌పీస్‌  ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సాక్షి  కార్టూనిస్ట్‌ శంకర్‌ రూపొందించిన కార్టూన్స్‌ మరో ఆకర్షణ. ముఖ్యంగా సినిమాలోని స్టోరీ బోర్డును ఎంచుకుని నగేష్‌ గౌడ్‌ అలనాటి రెండు బ్టాక్‌ బస్టర్‌ మూవీలు అడవి రాముడు, భక్తకన్నప్ప పెయింటింగ్స్‌ రూపొందించారు. ఒక స్టోరీ బోర్డులాగా తీర్చి దిద్దినట్టు నగేష్‌ గౌడ్‌ వెల్లడించారు. ఎంతో కమిట్‌మెంట్‌, డెడికేషన్‌, తపన ఉంటే ఇలాంటి అద్భుతాలు వెలుగులోకి రావు నిజంగా ఆర్టిస్టులకు ధన్యవాదాలు అంటూ విజిటర్స్‌  ఎంజాయ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు