పబ్జీ పోయినా ఈ గేమ్స్‌ ఉన్నాయిగా...

28 Jul, 2020 12:42 IST|Sakshi

భారత్‌ చైనా సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో దేశ భద్రతకు, సార్వభౌమాధికారానికీ, సమగ్రతకు నష్టం వాటిల్లే ప్రమాదముందని భావించిన కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్‌తో సహా 59 యాప్‌లను ప్రభుత్వం ఇప్పటికే నిషేధించిన విషయం తెలిసిందే. వీటితో పాటు మరో కొన్ని చైనా యాప్స్‌ వల్ల ముప్పు ఉందని భావించిన ప్రభుత్వం వాటిని కూడా  బ్యాన్‌  చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు  తెలుస్తోంది. వాటిలో టిక్‌టాక్‌లాగా  అ‍త్యంత ప్రజాదరణ పొందిన పబ్జీ, లూడో గేమ్‌లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పబ్జీ ప్రియులకు గుబులు మొదలైంది. పబ్జీలేకపోతే అలాంటి గేమ్స్‌  ఏమున్నాయా అని వెతికే పనిలో పడ్డారు. పబ్జీలాగు ఉండే కొన్ని ఆన్‌లైన్‌ గేమ్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

ఫోర్ట్‌నైట్‌: పబ్జీకి, ఫోర్ట్‌నైట్‌కు మధ్య ప్రారంభం నుంచే పోటీ కొనసాగుతుంది. ఈ రెండు ఆటలు రాయల్‌యుద్ద శైలి మీద ఆధారపడి ఉంటాయి. ఇవి రెండూ కూడా శక్తిమంతమైన యూజర్‌ బేస్‌ను కలిగి ఉంటాయి. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ రెండింటి నుంచి దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పబ్జీలా కాకుండా, ఫోర్ట్‌నైట్ గేమ్ గ్రాఫిక్స్ మరింత ఆసక్తికరంగా కనిపిస్తాయి.  గేమ్‌ ఆడటానికి విభిన్న పాత్రలు ఉంటాయి. ఇందులో  ఆటగాళ్ళు వుడ్స్, మెటల్ , మరిన్ని విభిన్న వస్తువులను సేకరించాల్సి ఉంటుంది. వీటిని ఉపయోగించడం ద్వారా వివిధ నిర్మాణాలను కట్టవచ్చు.  అదేవిధంగా  శత్రువులు చేసే దాడి నుంచి కాపాడుకోవచ్చు. 

కాల్ ఆఫ్ డ్యూటీ: ఇది మరో  ప్రసిద్ధ యుద్ధ-రాయల్ గేమ్ అదేవిధంగా  పబ్జీ మొబైల్‌ గేమ్‌కు మంచి ప్రత్యామ్నాయం. ఇందులో  బాటిల్ రాయల్ మోడ్ ఉంటుంది.  ఇక్కడ 100 మంది చివరి వరకు పోరాడవచ్చు.  ఇందులో మీరు షీల్డ్‌లాంటి వస్తువులను ఉపయోగించవచ్చు.  వినియోగదారులు మ్యాచ్ సమయంలో హెలికాప్టర్లు, మరెన్నో ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. క్యాప్చర్ ది ఫ్లాగ్ - గోల్డ్ ఎడిషన్ కూడా ఈ గేమ్‌లో ఉంది. ఈ మోడ్‌లో, ఆటగాళ్ళు జెండాను పట్టుకోవాల్సిన అవసరం లేదు. మరొక మోడ్ కిల్ కన్ఫర్మ్డ్.  ఇందులో 5 వర్సస్‌ 5 టీం డెత్‌మ్యాచ్‌ వుంటుంది.  స్నిపర్ వర్సస్‌ స్నిపర్ బాటిల్‌ ఫీల్డ్‌ కూడా ఉంది. 

గరేనా ఫ్రీ ఫైర్‌: ఇది పబ్జీ మొబైల్‌కు దేశీ ప్రత్యామ్నాయం.  ఈ ఆటలో ఉండే ఉత్తమమైన విషయం  ఏంటంటే ఇందులో గేమ్‌ ప్లే చిన్నది, అంతేకాకుండా క్రిస్ప్‌గా వుంటుంది. ఇందులో  ప్రతి మ్యాచ్‌లో, 50 మంది ఆటగాళ్లను మాత్రమే అనుమతిస్తారు. అంతేకాకుండా  మ్యాచ్ 10 నిమిషాల్లోనే ముగుస్తుంది.  ఇది తొందరగా మ్యాచ్‌లు ఆడాలనుకునే వారికి బాగుంటుంది.  ఆటగాళ్ళు స్క్వాడ్‌లతో పాటు సోలోలో కూడా ఆడవచ్చు. 

బ్యాటిల్‌ లాండ్స్‌ రాయల్‌: ఇతర బాటిల్‌ఫీల్డ్‌ ఆటలతో పోలీస్తే  ఈ ఆట చిన్నదిగా ఉంటుంది. బ్యాటిల్ ల్యాండ్స్ రాయల్ అనేది ప్రతి ఒక్కరూ ఆస్వాదించడానికి వీలుగా  ఉండే ఒక సాధారణమైన తుపాకీ ఆట. కొన్నిసార్లు పబ్జీ కన్నా దూకుడుగా అనిపిస్తుంది. 32 మంది ఆటగాళ్ళు,  3-5 నిమిషాల యుద్ధాలతో, ఇది గేమ్‌లో నాన్-స్టాప్ మారణహోమాన్ని సృష్టిస్తుంది. 

చదవండి: ప‌బ్జీ, లూడో కూడా ఇక లేనట్లే..


 

మరిన్ని వార్తలు