Aunty: ఆంటీ.. అంతగొప్ప స్థాయి ఉంది!

27 Aug, 2022 10:12 IST|Sakshi

ఆంటీ.. Aunty Trend గత 24 గంటలుగా సోషల్‌ మీడియాను కుదిపేస్తున్న పదం. అందుకు కారణం ఏంటో చాలామందికి తెలిసే ఉంటుంది. విరామం కూడా లేకుండా సదరు సెలబ్రిటీని మీమ్స్‌, ట్రోలింగ్‌తో తెగ వైరల్‌ చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో నెటిజన్స్‌. అయితే.. 

ఆంటీ అనే ఈ పదం ఎలా పుట్టిందో తెలుసా?. లాటిన్‌ పదం అమిటా Amita,  ఫ్రెంచ్‌ పాత పదం ఆంటే(Ante) నుంచి పుట్టుకొచ్చింది ఆంటీ అనే పదం. వాస్తవానికి ఆ రెండు పదాలకు అర్థం ఒక్కటే ‘కుటుంబ సంబంధం’ అని. కాలక్రమంలో ఒక కుటుంబంలో మహిళలకు.. బంధం కోసం ఈ పదం తీసుకొచ్చారు. అలా వాడుకలో వందల ఏళ్లుగా నడుస్తోంది ఈ పదం. 

ఆంటీ అంటే అత్త.. తండ్రి సోదరి. ఇది మాత్రమే కాదు.. ఆంటీ అనే బంధుత్వం ప్రకారం తల్లిదండ్రుల తోబుట్టువు కూడా. ఒక తరానికి రెండవ స్థాయి బంధువు.  అంటే ఆంటీ అనే పదానికి అత్త లేదంటే పిన్ని అనే అర్థాలు కూడా ఉన్నాయి. దీని ప్రకారం.. తల్లి తర్వాత తల్లి అంతటి స్థాయిని ఆంటీ అనే పదానికి ఇచ్చారు సమాజంలో. 

అయితే.. ఆంటీ అనే పదానికి నెగెటివిటీ రావడానికి కారణం.. జనాదరణ పొందిన ఒక సంస్కృతి. పాశ్చాత్య సంస్కృతిలో పాతరోజుల్లో పిల్లలు లేని మహిళలను ఆంటీలుగా వ్యవహరించేవాళ్లు. యువతతో సంబంధాల ద్వారా వీళ్లు సమాజానికి చేటు చేసేవాళ్లనే అభిప్రాయం ఒకటి నెలకొంది. అలా అక్కడి నుంచి.. ఆ సంస్కృతి మన దేశానికి పాకింది. ఆంటీ అంటూ కొందరిని చులకనగా చూడడం నడుస్తోంది. 

కానీ, మాతృత్వానికి ప్రాధాన్యతనిస్తూ..  ఆంటీ(అత్త/పిన్ని)కి సమాజంలో వాస్తవ గౌరవం ఉంది. అంతెందుకు తెలుగు సంస్కృతి ప్రకారం ఎక్కడికి వెళ్లినా.. పరిచయం లేని మహిళలను ఆంటీ అని సంభోదించడం.. వారి పట్ల గౌరవాన్ని ప్రదర్శించడమే!. కాబట్టి, ఆంటీ అనే పిలుపు #Ageshaming అవమానం, మహిళలను అగౌరవపర్చడం ఎంతమాత్రం కాదన్నది పలువురు నెటిజన్లు వెలిబుచ్చుతున్న అభిప్రాయం.

మరిన్ని వార్తలు