బంధువులు లేని పెళ్లి బరాత్‌.. వైరల్‌ వీడియో..

29 Apr, 2021 11:02 IST|Sakshi

వివాహం అనేది ప్రతి ఒ‍క్కరి జీవితంలో మరుపురాని తీపిగుర్తు. పెళ్లిలోని ప్రతి వేడుకను వధువరులు జీవితాంతం మరిచిపోలేనిదిగా ఉండాలనుకుంటారు. అయితే వివాహం జరిగిన అనంతరం ఏర్పాటు చేసే బరాత్‌లో కుటుంబసభ్యులు, స్నేహితులు చేసే డ్యాన్సుల హంగామా మాములుగా ఉండదు. ప్రతి ఒక్కరు దీన్ని ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తారు. అయితే తాజాగా, ఓ వరుడి  పెళ్లి బరాత్‌లో కేవలం బ్యాండ్‌వారు మాత్రమే కనిపిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కనిపించలేదు.

కరోనా సెకండ్‌ వేవ్‌ పెరుగుతున్న నేపథ్యంలో పెళ్లి బరాత్‌లో ఎవరు హాజరు కాకుండా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బంధువులతో, అల్లరిగా సాగాల్సిన పెళ్లి బరాత్‌ సందడి లేక వెలవెలబోయింది. సోషల్‌ మీడియాలో​ ఈ వీడియో చూసిన నెటిజన్లు  ‘పాపం.. కోవిడ్‌ మహమ్మారి వల్ల ఇలా అయింది’.. ‘ఇప్పుడే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు బ్రో.. ‘ అసలు నీ స్నేహితులు ఎక్కడికి వెళ్లారు. కరోనాకు భయపడి వచ్చారా? లేదా?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు