‘టాటాకు భారతరత్న ఇవ్వాలి’ ట్వీట్ల ఉద్యమం

6 Feb, 2021 15:53 IST|Sakshi

పారిశ్రామిక దిగ్గజం.. టాటా సంస్థ‌ల అధినేత ర‌త‌న్ టాటాకు భార‌త ర‌త్న ఇవ్వాలంటూ ట్విటర్‌లో ట్వీట్ల వెల్లువ కొనసాగుతోంది. ప్రతిభ ఉన్న వారిని నిరంతరం ప్రోత్సహిస్తూ.. తన ఉద్యోగులకు వెన్నుదన్నుగా నిలుస్తూ అందరి ప్రశంసలు పొందుతున్న టాటాకు భారత అత్యున్నత పురస్కారం ప్రకటించాలనే నినాదం ట్రెండవుతోంది. నిరంతరం సోషల్‌ మీడియాలో ఉత్సాహంగా ఉండే టాటాకు శుక్ర‌వారం రోజున #BharatRatnaForRatanTata #RatanTata అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్విట్ట‌ర్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ ప్రచారాన్ని చూసిన ర‌త‌న్‌టాటా స్పందించారు. ఇలాంటి ప్ర‌చారాల‌ను మానివేయాలంటూ ర‌త‌న్ టాటా నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. 

ఈ ప్రచారాన్ని మొదలుపెట్టింది మాత్రం మోటివేష‌న‌ల్ స్పీక‌ర్ డాక్ట‌ర్ వివేక్ బింద్రా. ర‌త‌న్ టాటాకు భార‌త‌ర‌త్న ఇవ్వాలంటూ మొదట వివేక్‌ ట్వీట్‌ చేశారు. దీంతోపాటు సోషల్‌ మీడియాలో కూడా ఈ పోస్ట్‌ చేశారు. దీంతో ఆయన చేసిన విజ్ఞప్తి ట్రెండింగవుతోంది. రతన్‌టాటాకు భారతరత్న ఇవ్వాలనే విజ్ఞప్తికి భారీ మ‌ద్దతు ల‌భిస్తోంది. రతన్‌టాటాకు భారతరత్న అనే నినాదంపై సోషల్‌ మీడియాలో ఓ ఉద్యమం కొనసాగుతోంది. తాజాగా దీనిపై రతన్‌టాటా స్పందించి ఈ విధంగా ట్వీట్‌ చేశారు. 

‘ఓ అవార్డు విష‌యంలో కొంద‌రు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం సాగిస్తున్నార‌ని, అయితే వారి మ‌నోభావాల‌ను గౌర‌విస్తా’. కానీ అలాంటి ప్ర‌చారాల‌ను దయచేసి నిలిపివేయాలి. భార‌తీయుడిగా పుట్టినందుకు గ‌ర్విస్తున్నా. దేశ ప్ర‌గ‌తికి స‌హ‌క‌రించేందుకు ఎప్ప‌డూ ప్ర‌య‌త్నిస్తూనే ఉంటా’ అని ర‌త‌న్ టాటా ట్వీట్‌ చేశారు. దీంతో ఆ డిమాండ్‌కు మరింత జోష్‌ వచ్చింది. చాలామంది ట్విటర్‌ ఖాతాదారులు రతన్‌టాటాకు భారతరత్న ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధానమంత్రి కార్యాలయానికి, రాష్ట్రపతి భవన్‌కు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ట్యాగ్‌ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. 
 

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు