ఫోన్‌ దొంగిలించిన పక్షి.. వీడియో వైరల్

15 Apr, 2021 19:31 IST|Sakshi

సాధారణంగా ఫోన్‌ మనజీవితంలో ఒక భాగమైపోయింది. కొంత మందిని దీన్ని ఆరోప్రాణంగా కూడా భావిస్తారు. అయితే.. ఇలాంటి ఫోన్‌ను ఎవరైన ఎత్తుకుపోతే ఇంకేమైనా ఉందా... అయితే తాజాగా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. ఫోన్‌ను ఎత్తుకుపోయింది. ఏ దొంగలో కాదూ.. ఒక పక్షి. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగవైరల్‌ అవుతుంది.  వివరాల్లోకి వెళ్తే.. ఒక మహిళ తన మిత్రులతో కలిసి టెర్రాస్‌ పైన సరదాగా మాట్లాడుకుంటున్నట్లున్నారు. వారి ఫోన్‌లను పక్కన పెట్టేసి మరీమాటల్లో మునిగిపోయారు.

అయితే, ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. ఒక పక్షి వచ్చి పిట్ట గోడ మీద ఉంచిన స్మార్ట్‌ఫోన్‌ను నోటితో కరుచుకుని అక్కడి నుంచి ఎగురుకుంటు వెళ్లిపోతుంది. అయితే , ఒక్కసారి షాక్‌కు గురైన  ఆ మహిళ ఆ పక్షి వెంట పరిగెత్తింది. ఆఫోన్‌ నాదీ..  నాదీ నాకిచ్చేయ్‌ అంటూ అరుస్తు దాని వెంట పడింది. ఆమెతో ఉన్న మిత్రులు మాత్రం ఆ పక్షిని పట్టుకొవడం మానేసి,  తన సహచరి ఫోన్‌ కోసం పడుతున్న సరదా సన్నివేశాన్ని ఫోన్‌లో వీడియో తీస్తు.. తెగ నవ్వుకుంటున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ పాపం, ఆ పక్షి తినే పదార్థం అనుకొని ఉంటుందేమో.. ఎవరికైన గిఫ్ట్‌గా‌ ఇవ్వాలనుకుందేమో’.. అని ఫన్నీగా కామెంట్‌లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు