ఈ వీడియో చూసి మ‌నం చాలా నేర్చుకోవ‌చ్చు!

1 Aug, 2020 11:55 IST|Sakshi

యుధ్ధంలో బ‌ల‌వంతుడు గెల‌వ‌డం, బ‌ల‌హీనుడు ఓడిపోవ‌డం జ‌రుగుతుంది. అయితే ముందే ఓడిపోతాం అని తెలిసి  పోరాడ‌క‌పోతే ఎలా? ఫ‌లితంతో సంబంధం లేకుండా  ఒంట్లో ఉన్న శ‌క్తినంతా కూడ‌గ‌ట్టి  ప్ర‌య‌త్నం చేయ‌డం మాత్రం చాలా ముఖ్యం. అచ్చం ఇలాంటి పోటీనే చిరుత ముళ్ల‌పంది మ‌ధ్య చోటుచేసుకుంది. చిరుత చాలా బ‌ల‌వంతం అయింది కాబ‌ట్టి అదే గెల‌స్తుంది అనుకుంటాం. కానీ మ‌ళ్ల‌పంది మాత్రం ఏ మాత్రం అదైర్య‌ప‌డ‌కుండా తీవ్రంగా పోరాడింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ అవుతోంది. ప్ర‌తీ మ‌నిషికి ఏదో ఒక ర‌క్షణ క‌వ‌చం ఉంటుంది. దీన్నే శ‌క్తివంతంగా మార్చుకొని త‌మ వైపు నుంచి ప్ర‌య‌త్నం చేయాలి.  వీడియోలో చూసిన‌ట్లు ముళ్ల‌పంది కూడా చిరుతతో పోలిస్తే త‌న శ‌క్తి త‌క్కువే అని తెలిసినా అది ఓట‌మిని అంగీకరించ‌డానికి ఇష్ట‌పడ‌లేదు. చిరుత పంజా విసిరినా మే మాత్రం అధైర్య‌ప‌డ‌కుండా త‌న‌కున్న ర‌క్ష‌ణ క‌వ‌చంతో చాక‌చ‌క్యంగా దాడిచేసింది అంటూ ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు. (గాలిలో ఐదు సెకండ్ల హ‌నీమూన్‌)

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు