వైరల్‌: కూతురు స్కూల్‌ వీడియోలో తండ్రి డ్యాన్స్‌

28 Nov, 2020 09:18 IST|Sakshi

స్కూల్‌ హోంవర్క్‌ చేస్తున్న ఓ అమ్మాయిని తన తండ్రి, సోదరుడు ఆటపట్టించాలకునే వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ చిన్నారి తల్లి జెన్నిఫర్‌ ఈ వీడియోను సోషల్‌ మీడియాతో పంచుకోగా అది  నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంది.  కాగా.. ఆ అమ్మాయి పేరు డెలానీ జోన్స్‌. ఆమె తను చేస్తున్న హొంవర్క్‌ను వీడియోను తీసి స్కూల్‌ టీచర్‌కు పంపడానికి కెమెరాను ఫిక్సింగ్ చేసింది. తర్వాత, ఆమె అలెక్సాను ఒక పాటను ప్లే చేయమని అడిగింది. ఆర్ట్‌ వర్క్‌ చేస్తుండగా, చిన్నారి  తండ్రి, సోదరుడు  వీడియోలో డ్యాన్స్‌ చేస్తూ  పలు రకాలుగా ఆటపట్టించే ప్రయత్నాలు చేశారు.

కాగా.. డెలానీ తల్లి జెన్నిఫర్ ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తూ "నేను డెలానీ చేసిన  వీడియో ను పాఠశాల యాప్‌ (సీసా)ను పంపిస్తున్నాను. డెలానీ తరచుగా ఏదో ఒక వీడియో తీసి ఉపాధ్యాయులకు పంపి.. వాళ్లను పలకరించడం, గుడ్‌నైట్‌ చెప్పడం, సరదాగా మాట్లాడటం లాంటివి చేస్తుంది. అయితే ఈ వీడియో మాత్రం మరికాస్త ఫన్నీగా ఉండబోతుంది. నేను అయితే చాలా నవ్వుకున్నాను. మీకు కూడా నచ్చుతుందని భావిస్తున్నా" అని క్యాప్షన్‌ జత చేశారు. అయితే.. తన కుమార్తె టీచర్స్‌ కోసం వీడియోను చేస్తుందని డెలానీ తండ్రికి తెలియదు. సరదాగా ట్యుటోరియల్ ఏదో వీడియో చేస్తుందనుకొని సరదాగా తనను  ఆటపట్టించాలనుకోగా, చివరికి ఆయనే నవ్వులపాలయ్యాడు. కాగా.. నవంబర్ 18న పోస్ట్‌ చేసిన ఈ వీడియోకు  14 మిలియన్లకు పైగా వ్యూస్‌ రాగా 11వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. 

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు