అనుకోని అతిధి రాకతో అద్భుతం..

25 Jul, 2020 10:04 IST|Sakshi

ఇంటర్నెట్‌ ప్రపంచంలో వింతలకు కొదవ లేదు. సామాజిక మాద్యమాలలో ఎక్కడ చూసిన మనల్ని ఆశ్చర్యపరిచే విషయాలు కనబడుతూనే ఉంటాయి. అలాంటి ఒక విషయాన్నే మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ‘నా హార్ప్ సెషన్ డిస్నీ చలన చిత్రంగా మారింది’ అనే శీర్షికతో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ యువతి ఆరుబయట నిలబడి ఒక వీణలాంటి (తీగలతో కూడిన ముక్కోణ ఆకారపు వాద్యము) పరికరాన్ని వాయించింది. 1965లో వచ్చిన  ‘హిట్ ది సౌండ్ ఆఫ్ సైలెన్స్’ అనే మ్యూజిక్‌ను ప్లే చేసింది. దీనిని వాయిస్తున్న సమయంలో ఆమె వీడియో తీసుకుంది. 

చదవండి: ఎక్క‌డా చూసి ఉండ‌రు.. ఇండియాలోనే సాధ్యం!

తరువాత ఆ వీడియోను చూసి ఆమె ఆశ్చర్య పోయింది. మ్యూజిక్‌ ప్లే చేస్తున్నప్పుడు అటుగా వచ్చిన ఒక జింక దానిని వింటూ అక్కడే ఆగిపోయింది. జాగ్రత్తగా ఆ సంగీతాన్ని వింటూ, ఆ వాయిద్యాన్ని చూస్తూ అక్కడే ఉండిపోయింది. తరువాత ఆ జింక అక్కడి నుంచి వెళ్లిపోవడంతో వీడియో ముగుస్తుంది.  దీనిని చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘ చాలా క్యూట్‌గా ఉంది. అది మీ దగ్గరకు రావాలనుకుంది కానీ  భయంతో అక్కడే ఉండిపోయింది అనుకుంటా. దానికి మీ సంగీతం బాగా నచ్చింది’ అని ఒక నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ఇది ప్రపంచంలోనే క్యూటెస్ట్‌  విషయం అని మరో నెటిజన్‌ స్పందించాడు. ఈ వీడియోను ఇప్పటి 32,000లకు పైగా లైక్‌ చేయగా 880కి పైగా కామెంట్స్‌ వచ్చాయి.   చదవండి: వైరల్‌: పులికి చెమటలు పట్టించిన పైథాన్‌

మరిన్ని వార్తలు