ఆ రెస్టారంట్‌ మె‘న్యూ’ చూస్తే కన్‌ఫ్యూజ్‌ అవ్వాల్సిందే..

25 Feb, 2021 23:58 IST|Sakshi

కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్‌లు ఈ మధ్యనే కాస్త పుంజుకుంటున్నాయి. ఈ సమయంలో కస్టమర్లను ఆకర్షించేందుకు కొన్ని రెస్టారెంట్లు వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తు్తంటే..ఫుణేలోని ఓ రెస్టారెంట్‌ వింత మెనూతో ముందుకొచ్చింది. సాధారణంగా మెనూలో ఆహార పదార్థాల లిస్టు ఉంటుంది. కానీ ఈ రెస్టారెంట్‌.. మెనూలో ‘డూస్‌ అండ్‌ డోంట్స్‌’ అంటూ విచిత్ర జాబితా పెట్టి కస్టమర్లను కన్‌ఫ్యూజ్‌ చేస్తోంది. విచిత్రంగా వ్యవహరిస్తున్న ఈ రెస్టారెంట్‌ పేరు ‘ఇరానీ కేఫ్‌’. ఈ కేఫ్‌లో ఎంతో రుచికరమైన తినుబండారాలు తక్కువ ధరకే దొరుకుతాయి. అయితే  రెస్టారెంట్‌ ఫుడ్‌ మెనూలో రెండు డజన్ల వింత నిబంధనలను చేర్చింది యాజమాన్యం.

రెస్టారెంట్‌కు వెళ్లినవారు, రెస్టారెంట్‌ పరిసరాల్లో ఉన్న వారంతా తప్పనిసరిగా ఈ రూల్స్‌ పాటించాల్సిందేన ట. నిబంధనల్లో ‘‘నో స్మోకింగ్, నో అవుట్‌ సైడ్‌ ఫుడ్, నో బార్గెయినింగ్, నో బ్రషింగ్‌ టీత్, నో స్లీపింగ్, నో కోంబింగ్, నో ఫ్రీ అడ్వైస్, గాంబ్లింగ్‌ గురించి చర్చించకూడదు, చిల్లర అడగడం వంటివాటిని రెస్టారెంట్‌లో అనుమతించరు. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరికి ఈ నిబంధనలు నచ్చుతుంటే మరికొందరికి ఊపిరి కూడా పీల్చుకోవద్దు అంటారా ? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఈ రెస్టారెంట్‌కు ఒక్కసారైనా వెళ్లాల్సిందేనని చెబుతున్నారు. 

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు