వైరల్‌: మీకెంత ధైర్యం.. నన్నే ఫాలో అవుతారా?

25 Feb, 2021 14:00 IST|Sakshi

జంతువులను చూసేందుకు అడవులకు వెళ్లినప్పుడు సాధారణంగా వాటిని దూరం నుంచి చూస్తాం. కొన్ని సార్లు తమకు నచ్చిన  జంతువులను చూశామన్న ఆనందంలో వాటి దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తాం. ఇలాంటి ఘటనల వల్ల చాలా మంది జంతువుల చేతిలో ప్రాణాలు కొల్పొయిన విషయం తెలిసిందే. మరి కొన్నిసార్లు ఆ జంతువులు వారిపై ఎదురు తిరిగితే భయంతో పరుగెత్తిన వార్తలు చదివాం. తాజాగా ఓ ఏగును దాని వెనకాల వచ్చిన టూరిస్టు బృందం మీద గట్టిగా అరుస్తూ వచ్చిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారి సురేందర్ మెహ్రా తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘ఏం జరగలేదు. వీరు ఏనుగును వీడియో తీశారు. వన్యప్రాణులను, ముఖ్యంగా ఏనుగులను ఎదుర్కొన్నప్పుడు మనకు ఎన్నిసార్లు ఒకేలా అనిపిస్తుంది. అడివిలోకి జంతువులను చూడడానికి వెళ్లినపు​డు చాలా జాగ్రత్త ఉండాలి. ప్రకృతి వారికి ఓ పాఠం నేర్పింది’ అని ఆయన కామెంట్‌ జత చేశారు.

వివరాలు.. ఓ పర్యాటకుల బృందం​ జీపులో కూర్చోని అడవిలో తిరుగుతూ.. ఓ ఏనుగు వెనక నుంచి వీడియో తీశారు. ఆ ఏనుగు తమను చూడలేదని భావిస్తూ దాని వెనకాలే జీపుతో ముందుకు వెళ్లారు. కానీ, ఆ ఏనుగు ఒక్కసారిగా వెనక్కు తిరిగి వారి వాహనంపైకి కోపంగా అరుస్తూ పరుగెత్తుకొని వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘అడవిలో ఉన్నప్పుడు, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి.. జంతువులను గౌరవించాల్సిన అవసరం ఉంది.. వాళ్లు చాలా పిచ్చి మనుషులు.. ఏనుగులు శబ్దాలు వింటాయని మర్చిపోయారా?’ అని ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు ఆరు వేల మంది వీక్షించారు. 

చదవండి:  ఏనుగుపై దాడి.. మీరు మనుషులా రాక్షసులా!

మరిన్ని వార్తలు