వైరల్‌: గున్న ఏనుగు చిలిపి స్నానం

27 Sep, 2020 12:05 IST|Sakshi

జంతువులకు నీళ్లు కనిపిస్తే చాలు అందులోకి దూకి హాయిగా మునుగుతూ, తేలుతూ సేదతీరుతాయి. ఇక స్నానం చేయించే సమయంలో అయితే అవి మరింత ఉత్సాహంతో జలకాలాటలు ఆడుతాయి. తాజాగా ఓ గున్న ఏనుగు స్నానం చేసే సమయంలో వాటర్‌ టబ్‌లోకి దిగి జలకాలాటలు ఆడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను సైమన్ బీఆర్‌ఎఫ్‌సీ హాప్కిన్స్ అనే ట్విటర్‌ ఖాతా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. దానికి ‘ఏనుగు స్నానం చేసే సమయం’ అని కాప్షన్‌ కూడా జతచేసింది. చదవండి: (వైరల్‌: రెండు ఏనుగులు ప్రేమతో సరదాగా..)

బురదలో తిరిగి వచ్చిన తల్లి ఏనుగు, గున్న ఏనుగుకు వాటి కీపర్‌ నీటి పైపుతో స్నానం చేయిస్తాడు. నీటి వైపుతో వాటిపై నీళ్లు పడుతున్న సమయంలో గున్న ఏనుగు అక్కడే ఉన్న ఒక నీటి తొట్టి దగ్గరకు వెళ్లి దానిలోకి దిగుతుంది. ఆ నీటిలో ఫన్నీగా మునుగుతూ, తేలుతూ ఎంజాయ్‌ చేస్తుంది. ప్రస్తుతం గున్న ఏనుగు చేసిన చిలిపి స్నానం వీడియోను సోషల్‌ మీడియాలో అధిక సంఖ్యలో నెటిజన్లు వీక్షిస్తూ లైక్‌ చేస్తున్నారు. చిన్న ఏనుగు బాత్‌ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘దీని కంటే ఏదైనా ఆహ్లాదం ఉంటుందా? అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. 

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు