మ్యాగీ విత్‌ పెరుగు ట్రై చేశారా?!

21 Nov, 2020 10:46 IST|Sakshi

మ్యాగీ.. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికి ఫేవరెట్‌ ఫుడ్‌ ఐటం. చాలా వరకు ఊరికే నీటిలో వేసి ఉడికించుకుని తింటారు. కొందరు మాత్రం పోపు వేసి కూరగాయలతో కలిపి వండితే.. మరి కొందరు ఎగ్‌, చికెన్‌తో ట్రై చేస్తారు. కానీ మ్యాగీని పెరుగతో ఎప్పుడైనా తిన్నారా. పేరు వినగానే ముఖం అదోలా మారిపోయింది కదా. చాలా మంది అస్సలు వినడానికి, ట్రై చేయడానికి ఇష్టపడని ఈ కాంబినేషన్‌ని ఓ యువతి నిజం చేసి చూసింది. మ్యాగీలో పెరుగు వేసుకుని తిన్నది. ‘మ్యాగీ అండ్‌ కర్డ్‌ ఇజ్‌ ఫుడ్‌ ఫర్‌ ద సౌల్’‌ పేరుతో ట్విట్టర్‌లో మ్యాగీలో పెరుగు కలిపిన ఫోటోని షేర్‌ చేసింది. ఇది చూసిన నెటిజనుల్లో ఎక్కువ మంది ‘ఏం టెస్ట్‌ తల్లి .. ఇంత చండాలంగా ఉంది’.. ‘మ్యాగీ మీద విరక్తి పుట్టించావ్‌గా’..  ‘అసాధ్యాన్ని సాధ్యం చేశావ్‌గా’ అని కామెంట్‌ చేస్తుండగా.. మరి కొందరు మాత్రం ‘అద్భుతం’.. ‘టేస్ట్‌ కోసం దానిలో మయోన్నైస్‌ కలపండి’ అంటూ సూచనలు చేస్తున్నారు. (చదవండి: నిన్ను చూస్తుంటే కడుపు మండుతోంది)

గతేడాది ఓ యువతి పాలు, గులాబీ రెక్కలతో స్వీట్‌ మ్యాగీ తయారు చేసింది.  "చాక్లెట్ మ్యాగీ",  "మ్యాగీ పానీపూరి" అనే విభిన్న వంటకాలు భోజ‌న ప్రియుల‌కు వికారం క‌లిగించిన విష‌యం తెలిసిందే. ఇవేకాక రసగుల్లా బిర్యానీ, చాక్‌లెట్‌ చికెన్‌ వంటి వింత వంటకాలు వైరలయిన సంగతి తెలిసిందే. 

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు