ప‌ట్టించుకోలేద‌ని పెళ్లికూతురిని త‌న్నేసింది..

31 Oct, 2020 16:53 IST|Sakshi

బీజింగ్ : పెంపుడు కుక్క‌లు  త‌మ‌ య‌జ‌మానిపై విప‌రీత‌మైన ప్రేమ‌ను కురిపిస్తూ చాలా విశ్వాసంగా ఉంటాయి. త‌మ‌ను ప‌ట్టించుకోకుండా నిర్ల‌క్ష్యం చేస్తే కొంచెం అప్‌సెట్ కూడా అవుతాయి. కుక్క‌ల‌కు కూడా ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయా అంటే..ఈ వీడియో చూస్తే అవున‌నే అంటారు. చైనాకు చెందిన 25 ఏళ్ల కావో అనే మ‌హిళ శాన్ జియు అనే కుక్క‌ను పెంచుకుంటుంది. ఈ మ‌ధ్యే పెళ్లి ఫిక్స‌య్యింది. దీంతో  పెళ్లిప‌నుల్లో కాస్త బిజీబిజీగా ఉంటూ కుక్క‌ను ప‌ట్టించుకోలేదు. అంతే కుక్కకు కోపం వ‌చ్చి పెళ్లి వేదిక‌పైనే  పెళ్లికూతురిని  ఓ త‌న్ను త‌న్నేసింది. చైనాలోని బోజౌలో జ‌రిగిన పెళ్లి వేడుక‌లో నూత‌న వ‌ధూవ‌రులు కుక్క‌ను తీసుకొని  ఫోటోల‌కు ఫోజులిస్తుండ‌గా శాన్ జియు త‌న య‌జ‌మానిని క‌డుపులో ఒక్క ఒదుటున త‌న్నేసింది. అంతేకాకుండా త‌న‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకున్న పెళ్లికొడుకును మాత్రం ముద్దులతో ముంచెత్తింది. (శ్రీమతి కోరిక : టెర్రస్ ఎక్కిన స్కార్పియో )

అనుకోకుండా జ‌రిగిన ఈ సంఘ‌ట‌న‌తో పెళ్లికూతురు స‌హా అక్క‌డున్న అతిథులంతా షాక్ అయ్యారు. కుక్కకు కోప‌మోస్తే ఇలా ఉంటుంది కాబోలంటూ న‌వ్వుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఎవ‌రో సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో ఇది కాస్తా వైర‌ల్ అయ్యింది.  పెళ్లిలో కుక్క చేసిన ఈ క్యూట్ ఎమోష‌నే హైలెట్‌గా నిలిచిందంటూ పెళ్లికూతురు కావో సైతం చ‌మ‌త్క‌రించింది. పెళ్లి హ‌డావిడిలో ఉండి కొన్ని రోజులు ప‌ట్టించుకోక‌పోయే  స‌రికి శాన్ జియుకి కోపం వ‌చ్చింద‌ని, అయితే త‌న భ‌ర్త‌తో మాత్రం చాలా అల్ల‌రి చేస్తూ ఉత్సాహంగా ఉంటుంద‌ని చెప్పుకొచ్చింది. (ఆన్‌లైన్‌​ గేమ్‌ ఆడుతుండగా భూకంపం.. )

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా