మానవత్వం అంటే ఇదేనేమో

4 Apr, 2021 11:29 IST|Sakshi

ఇతరులకు ఆపద సమయంలో మనకి చేతనైన సహాయాన్నిచేయడమే మానవత్వం. ప్రస్తుత ప్రపంచానికి పదం పెద్దగా పరిచయం ఉండక పోవచ్చేమో. ఎందుకంటే ఈ ఆన్‌లైన్‌ యుగంలో పక్కన వాళ్లనే పట్టించుకునే తీరిక లేకుండా గడుపుతుంటాం. కానీ ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి చేసిన పని చూస్తే మనుషుల్లో ఇంకా మిగిలే ఉందనిపిస్తుంది.

ఫుట్‌ పాత్‌ మీద జీవనం సాగించే ఇతను పార్క్ వెలుపల రెండు వీధి కుక్కలు చలికి వణుకుతుండడం చూసి చలించి పోయాడు. వాటిని రోడ్డు పక్కనే ఉన్న తన బెడ్ మీద పడుకోపెట్టాడు.  వాటి కోసం ఆహారం, నీరు ఓ ప్లాస్టిక్ గిన్నెలలో ఏర్పాటు చేశాడు. అంతే గాక ఆ కుక్కలకు కాపలాగా పక్కనే కూర్చున్నాడు. సహాయం చేయాలంటే కావాల్సింది ఇతరులకు సహాయపడాలనే గుణం మాత్రమే.. డబ్బు, మరేదో కాదని ఇతన్ని చూస్తే అర్థమౌతుంది.

దీనికి సంబంధించిన ఫొటోను ఇండియన్‌ ఫారెస్ట్‌ అధికారి సుసంతా నందా ట్విటర్‌లో షేర్ చేశారు. ‘తక్కువ ఉన్నవారే ఎక్కువగా ఇస్తుంటారు’ అని ఆయన క్యాప్షన్‌ పెట్టారు. ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. నెటిజన్లు ఈ పోస్ట్‌కు ఎమోష్‌నల్‌ గా కనెక్ట్‌ అయ్యారు.‘ నిజంగా అతనిది చాలా పెద్ద మనసు’  అని కొందరు, ‘అతను చాలా గ్రేట్’ అంటూ మరికొందరు కామెంట్లు చేశారు.

( చదవండి: రోడ్లపై చెత్త వేస్తున్నారా? సిగ్గు పడండి, కాకి వీడియో వైరల్) 

మరిన్ని వార్తలు