వైరల్‌: చావోరేవో అన్నట్లు.. గట్టిగా అరుస్తూ హంగామా

19 Apr, 2021 14:27 IST|Sakshi

బుల్లి హమ్మింగ్‌ బర్డ్‌  పాముకు సమఉజ్జీ కానేకాదు.. కానీ.. గుండె ధైర్యం ఎక్కువలాగుంది.. అందుకే తన గూటి జోలికి.. అందులో ఉన్న పిల్లల జోలికి రావడానికి ప్రయత్నిస్తున్న ఈ గ్రీన్‌ పిట్‌ వైపర్‌కు ఎదురెళ్లింది.. చావోరేవో అన్నట్లు తెగించింది.. గట్టిగా అరుస్తూ.. దాని చుట్టూ తిరుగుతూ హంగామా చేసింది.. ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించింది.. ఏమనుకుందో ఏమో.. చివరికి ఈ పాము వెనక్కి తగ్గింది. పిట్టదే పైచేయి అయింది.. ఈ చిత్రాన్ని బెన్స్‌మేట్‌ అనే ఫొటోగ్రాఫర్‌ తీశారు.
కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం.. ఇది మనకు తెలిసిందేగా.. అయితే.. ఇక్కడ విడవలేదు.. అలాగని కరవనూలేదు.. ఇదో చాలా చిత్రమైన పరిస్థితి. ఫొటో చూస్తున్నారుగా.. తనను కరవడానికి వచ్చిన పాము గొంతును ఈ కప్ప ఎలా పట్టుకుందో.. ఈ ట్రీ స్నేక్‌ కప్పను అమాంతం మింగేద్దామని వచ్చినా.. అది తెలివిగా పక్కకు తప్పుకోవడంతో ఈ మాత్రమే నోటికి చిక్కింది.

దీంతో కప్ప విజృంభించేసింది.. పట్టు బిగించింది.. ఇలా ఇవి కొన్ని గంటలపాటు ఉండిపోయాయట. అలా ఉండిఉండి నీరసించి.. చివరికి దేనిదారిన అవి వెళ్లిపోయాయట. ఈ చిత్రాన్ని బెలీజ్‌ దేశ అడవుల్లో డేవిడ్‌ మైట్‌ల్యాండ్‌ అనే ఫొటోగ్రాఫర్‌ క్లిక్‌మనిపించారు.
చదవండి: ఈ హెరిటేజ్‌ సైట్స్‌లోకి వెళ్లలేం.. ఇదొకటే దారి!

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు