‘ట్విటర్‌ నీ టైమ్ అయిపోయింది’

10 Feb, 2021 18:45 IST|Sakshi

ఇటీవల ట్విటర్‌పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఖాతాల తొలగింపు.. లేదా పోస్టుల డిలీట్‌ వంటి అంశాలు వివాదం రేపిన విషయం తెలిసిందే. ట్రంప్‌ మొదలుకుని మనదేశంలో కంగనా వరకు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే సామాజిక మాధ్యమం ట్విటరే. ఇప్పుడు ఆ యాప్‌కు ప్రత్యామ్నాయంగా సరికొత్త యాప్‌లు వస్తున్నాయి. ప్రస్తుతం ట్విటర్‌కు దేశీయ యాప్‌గా ‘కూ’ (Koo)ను పేర్కొంటున్నారు. 

ఈ దేశీయ యాప్‌ను ప్రముఖులు వినియోగించడం మొదలుపెట్టారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, పీయూశ్‌ గోయల్ వంటి వారు కూలో చేరారు. తాజాగా ఇటీవల ట్విటర్‌లో తన ట్వీట్ల తొలగింపునకు గురయిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూలో చేరింది. సరికొత్త యాప్‌లో చేరిన కొద్దిసేపటికే ట్విటర్‌కు కౌంటర్‌ ఇచ్చింది. ట్విటర్‌ పనైపోయిందని తెలిపింది.

‘ట్విటర్ నీ టైమ్ అయిపోయింది. కూ యాప్‌కు హాయ్ చెప్పే సమయం వచ్చింది. త్వరలోనే అకౌంట్ వివరాలు తెలుపుతా. దేశీయంగా అభివృద్ది చెందిన యాప్ ఓపెన్ చేసినందుకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది’ అని కంగనా ట్వీట్ చేసింది. ఈ విధంగా కూ యాప్‌ వినియోగం భారతదేశంలో పెరుగుతోంది. ట్విటర్‌కే కాదు వాట్సప్‌కు ప్రత్యామ్నాయంగా దేశంలో దేశీయ యాప్స్‌ రూపొందిస్తున్నారు. 

చైనా మాదిరి అన్ని స్వదేశీ సామాజిక మాధ్యమాలు రూపొందించేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రోత్సాహం కూడా కల్పిస్తున్న విషయం తెలిసిందే.  ట్విటర్‌కు ప్రత్యామ్నాయం ‘కూ’ రాగా, వాట్సాప్‌కు పోటీగా సందేశ్ అనే యాప్‌ను రూపొందించారు. టెలిగ్రామ్‌ కూడా. ప్రస్తుతం వీటి వినియోగం పెరిగింది.
 

మరిన్ని వార్తలు