వైరల్‌: వీళ్ల డ్యాన్స్‌ చూస్తే మతిపోవాల్సిందే!‌

5 Apr, 2021 13:42 IST|Sakshi

తిరువనంతపురం: వైద్య విద్యార్థులు అంటే సాధారణంగా పుస్తకాలు, ప్రాక్టికల్స్‌తో కుస్తీ పడుతుంటారని అనుకుంటాం. అయితే, గతంలో వైద్య విద్యార్థులు కాలేజీలో సరదాగా తమ కాలేజీల్లో పాటలు పాడటం, డ్యాన్స్‌లు చేసిన వార్తలను చూశాం. తాజాగా కేరళకు చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులు చేసిన డ్యాన్స్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వారిద్దరు మెడికల్‌ కాలేజీ యూనిఫామ్‌లోనే అద్భుతమైన ఫుట్‌ వర్క్‌, సున్నితమైన కదలికలు, పాటకు తగిన హావభావాలను పలికిస్తూ చాలా వైవిధ్యంగా డ్యాన్స్‌ చేశారు. త్రిస్పూర్‌ మెడికల్‌ కాలేజీకి చెందిన జానకి ఓం కుమార్‌, నవీన్‌ కె రజాక్‌ ప్రముఖ బోనీ ఎం గ్రూప్‌కు చెందిన రాస్‌పూటిన్‌ సాంగ్‌కు ఇద్దరు అద్భుతంగా తమ కాలేజీ కారిడార్‌లో చిందులు వేశారు.

జానకి మెడిసిన్‌ మూడో ఏడాది విద్యార్థిని, నవీన్‌ నాలుగో ఏడాది విద్యార్థి. ముందుగా వారు చేసిన డ్యాన్స్‌ వీడియోను నవీన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. ఆ తర్వాత జానకి తన యూట్యూబ్‌ చానెల్‌లో అప్‌లోడ్‌ చేశారు. దీంతో ఒక్కసారిగా వారు చేసిన డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ డ్యాన్స్‌‌ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ​‘వావ్‌..  చాలా అద్భుతం, నా బాల్యాన్ని జానకి, నవీన్‌ గుర్తుచేశారు. రాస్‌పూటిన్‌ సాంగ్‌ బీట్‌ నా హృదయానికి సున్నితంగా తగిలింది’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. వైద్య విద్యార్థుల డ్యాన్స్‌ చూశాక నా మతిపోయింది’,  ‘వారు ధరించిన ష్యూ డ్యాన్స్‌ చేయడానికి చాలా సౌకర్యంగా ఉంది’ అని నెటిజన్లు‌ కామెంట్లు‌ చేస్తున్నారు.

చదవండి: వైరల్‌: ఈ లంచ్‌ బాక్స్‌ చూస్తే కన్నీళ్లు ఆగవు

మరిన్ని వార్తలు