వైరల్‌: ఆనందం పట్టలేక ఏడ్చేశాడు

24 Sep, 2020 10:58 IST|Sakshi

సాధారణంగా మనకు చాలా ఇష్టమైన వాటిని ఎవరైనా బహుమతిగా అందజేస్తే మన ఆనందానికి అవధులు ఉండవు. అది ఆశ్చర్యపరిచే సందర్భమైతే ఇక మాటల్లో వర్ణించలేం. అలా కోరుకున్నది కళ్ల ముందు ప్రత్యక్షమవడంతో సంతోషం పట్టలేక ఆనంద బాష్పాలు కార్చుతూ ఏడ్చేస్తాం కూడా. అచ్చం అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్న ఓ బాలుడికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ బాలుడు సోఫా మీద కూర్చోని తన మొబైల్ ‌ఫోన్‌లో గేమ్‌ ఆడుకుంటూ ఉంటాడు. అతని తల్లి ఒక క్యూట్‌ కుక్కపిల్ల(పప్పి)ని ఆ బాలుడికి తెలియకుండా తీసుకువచ్చి ఇస్తుంది. కుక్క పిల్లలంటే అమితంగా ఇష్టపడే ఆ బాలుడు తన తల్లి తీసుకువచ్చిన ఆ కుక్క పిల్లను చూసి ఒక్కసారిగా ఆనందం పట్టలేక ఏడ్చేస్తాడు. దీనికి సంబంధించిన వీడియోను ‘సైమన్ బీఆర్‌ఎఫ్‌సీ హాప్కిన్స్’ అనే ట్వీటర్‌ ఖాతా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ‘అతడు ఎల్లప్పుడూ కుక్క పిల్లలను ఇష్టపడతాడు. తన తల్లి క్యూట్‌ కుక్కపిల్లను ఇంటికి తీసుకువచ్చినప్పుడు అతని స్పందన చూడండి’ అంటూ కాప్షన్‌ జతచేసింది.

ఈ వీడియోను వేల మంది నెటిజన్లు వీక్షించగా వందల మంది లైక్‌ చేశారు. వీడియోను చూసిన నెటిజన్లు ఆ బాలుడి ఇష్టాన్ని తెలుసుకున్న తల్లిని ప్రశంసిస్తున్నారు. ‘ఆ కుక్కపిల్ల బాలుడి అద్భుతమైన జీవితానికి నాంది పలికింది, ‘ఈ వీడియో చూస్తే నాకు భావోద్వేగంతో కన్నీళ్లు ఆగడంలేదు’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ‘కుక్క పిల్లలు స్వర్గం నుంచి దేవుడు పంపిన ప్రత్యేక కానుకని ఆ బాలుడు గుర్తించాడు’ అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా