సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న క్యూట్‌ వీడియో

25 Sep, 2020 09:20 IST|Sakshi

పెంపుడు జంతువులతో మనిషికి ప్రత్యేక అనుబంధం ఉంటుంది. మన నుంచి ఎలాంటి లాభాన్ని ఆశించకుండా నిస్వార్థంగా ప్రేమిస్తాయి. అందుకే చాలా మంది ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం పెట్స్‌ని పెంచుకుంటారు. ఇంట్లో మనిషిలానే చూస్తారు. ఈ క్రమంలో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న ఓ వీడయో పెట్‌ లవర్స్ అందరిని తెగ ఆకర్షిస్తోంది. దీనిలో ఓ చిన్నారి తన పెంపుడు కుక్కతో కలిసి మూవీ చూస్తుంది. ఈ క్యూట్ వీడియోని బీఆర్‌ఎఫ్‌సీ హాప్కిన్స్‌ అనే ట్విట్టర్‌ యూజర్‌ తన అకౌంట్‌లో షేర్‌ చేశారు. 22 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఓ చిన్న పాప తన మంచం మీద పడుకుని దుప్పటి కప్పుకుని టాబ్లెట్‌లో మూవీ చూస్తూ ఉంటుంది. పాప పక్కనే తన పెంపుడు కుక్క కూడా ఉంటుంది. అది చిన్నారి ఒడిలో పడుకుని మూవీ చూస్తుంటే.. పాప దాన్ని నిమిరుతూ.. సినిమా చూస్తూ అలా నిద్రలోకి జారుకుంటుంది. కుక్క పట్ల ఈ చిన్నారి చూపించిన ప్రేమ, కేర్‌ నెటిజనుల మనసులను కదిలిస్తోంది. చాలా క్యూట్‌గా ఉందంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు. (వైరల్‌: ఆనందం పట్టలేక ఏడ్చేశాడు)

మరిన్ని వార్తలు