వైస్‌ ప్రిన్సిపల్‌కే షాకిచ్చిన స్టూడెంట్స్‌

30 Nov, 2020 13:47 IST|Sakshi

కోవిడ్‌-19 కారణంగా తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో దాదాపు అన్ని  విద్యాసంస్థలు ఆన్‌లైన్‌  క్లాసులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. క్లాస్‌రూంలో సిన్సియర్‌గా పాఠాలు వినే స్టూడెంట్స్‌ ఎంతమంది ఉంటారో  తుంటరి విద్యార్థులు సైతం  ఉంటారు. క్లాసులు జరుగుతున్నప్పుడే మిగతా విద్యార్థులతో పాటు, టీచర్‌పై కామెంట్లు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం తరగతి గదులకు నేరుగా హాజరయ్యే పరిస్థితి లేకపోవడంతో ఈ ఫన్‌ని మిస్‌ అవుతున్నాం అనుకున్నారో ఏంటో ఆన్‌లైన్‌ క్లాస్‌ జరుగుతుండగా, కొం‍దరు విద్యార్థులు ఏకంగా వైస్‌ ప్రిన్స్‌పల్‌ పైనే జోకులేశారు. 

అందుకు బదులుగా ఆయన కూడా స్టూడెంట్స్‌కు గట్టి చివాట్లే పెట్టారు. ఇంతకీ ఏం జరిగిందంటే..క్లాస్‌ జరుగుతండగా‌సర్‌ ఒక డౌట్ అంటూ స్టూడెంట్‌  ప్రశ్నించగా...ఏంటో చెప్పమని వైస్‌ ప్రిన్సిపల్‌ అడిగారు. దీంతో మీ టూత్‌ పేస్ట్‌లో ఉప్పు ఉందా సర్‌ అంటూ తుంటరి ప్రశ్న వేశాడు.  ఇందుకు బదులుగా 'ఉప్పు అంటూ ఎలా ఉంటుందో చూపిస్తా..నువ్వు మళ్లీ స్కూల్‌లో కనపడకుండా చేస్తా' అంటూ వైస్‌ ప్రిన్స్‌పల్‌ ఫైర్‌ అ‍య్యారు.

ఆ తర్వాత కూడా కొందరు స్టూడెంట్స్‌ జోకులు వేయడానికి ప్రయత్నించగా..ఈ మొత్తం వ్యవహారాన్ని రికార్డ్‌ చేశానని, వైస్‌ ఛైర్మన్‌కు కంప్లెంట్‌ చేస్తానని ఫైర్‌ అయ్యారు. అంతేకాకుండా వేరే విద్యార్థులను సైతం ‌ సెషన్‌ నుంచి వెళ్లిపోవాలని శాసించారు. అయితే దీనికి ఏమాత్రం బెదరని స్టూడెంట్స్‌ అదేపనిగా కామెంట్లు చేస్తుండటంతో కోపంతో ఊగిపోయిన వైస్‌ ప్రిన్సిపల్‌ చివరికి ఆయనే ఆన్‌లైన్‌ సెషన్‌ నుంచి లాగ్‌అవుట్‌ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. టీచర్‌పై కామెంట్లు చేసి నవ్వుకుందామనుకున్న స్టూడెంట్స్‌కి వైస్‌ ప్రిన్సిపల్‌ గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. 
 

మరిన్ని వార్తలు