పడేయకుండా.. ల్యాప్‌టాప్‌కు అంత్యక్రియలు

8 Jun, 2021 17:02 IST|Sakshi
శ్మశాన వాటిక రిసెప్షనిస్టుతో మాట్లాడుతున్న యువకుడు

ఇన్నాళ్లు తాను వినియోగించిన ల్యాప్‌టాప్‌ ఇక పనికి రాకుండా పోయింది. దాంతో విడదీయరాని బంధం ఏర్పడింది. దీంతో ఆ ల్యాప్‌టాప్‌కు అంత్యక్రియలు చేయాలని ఓ యువకుడు ప్రయత్నాలు చేశాడు. అంత్యక్రియల కోసం శ్మశాన వాటికకు వెళ్లగా అక్కడి సిబ్బంది వింతగా చూశారు. అనంతరం అతడి విజ్ఞప్తికి ససేమిరా అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో మిలియన్లలో వ్యూస్‌ వచ్చాయి.

టిక్‌టాక్‌ స్టార్‌ జెన్‌ అకా@కింగ్‌జెన్‌ తన ల్యాప్‌టాప్‌ను తీస్కోని శ్మశాన వాటిక (ఫ్యూనరల్‌ హోం)కు వెళ్లాడు. అక్కడ ఉన్న రిసెప్షనిస్టును కలిసి ‘అంత్యక్రియలు చేయాలి’ అని అడగా ‘మృతదేహం ఎక్కడ? అని ఆమె అడిగింది. ‘ఇక్కడే ఉంది. అది నా ల్యాప్‌టాపే’ అని ఆ యువకుడు తన ల్యాప్‌టాప్‌ను చూపించాడు. అది చూసి ఆమె నోరెళ్లబెట్టింది. ‘ఓ మీ ల్యాప్‌టాప్‌ చచ్చిపోయిందా?’ అని రిసెప్షనిస్టు అడిగింది. అవును! మీరేమైనా ఏర్పాట్లు (అంత్యక్రియలు) చేయగలరా? అని అడుగుతున్న వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. 

ఈ వీడియో టిక్‌టాక్‌లో తెగ వ్యూస్‌ వచ్చేశాయి. ఏకగా 2 మిలియన్ల మందికి పైగా చూశారు. గ్యాడ్జెట్స్‌తో మనకు ఉన్న ప్రేమను.. అనుబంధం చూపించేందుకు ఈ వీడియో రూపొందించినట్లు టిక్‌టాక్‌ స్టార్‌ జెన్‌ తెలిపాడు. కరక్టే కదా! మన శరీరంలో గ్యాడ్జెట్లు ఒక అవయంగా మారాయి. అవి లేనిది మనకు పనులు జరగవు. ఇది తెలిపేందుకు అతడు ఈ వీడియో చేశాడు. ఈ వీడియోకు విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి. అయితే అతడు ఏ దేశస్తుడో వివరాలు తెలియరాలేదు.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు