ఏడేళ్లలో తొలిసారి 20నిమిషాలు లేటుగా ఆఫీసుకు.. ఉద్యోగం నుంచి తొలగింపు!

4 Aug, 2022 15:58 IST|Sakshi

ఆఫీస్‌కు సరైన సమయానికి చేరుకోవాలని ప్రతి ఒక్క ఉద్యోగి భావిస్తాడు. కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల కొంత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సంస్థలు కొంత ఆలస్యంగా వచ్చేందుకు వెసులుబాటు కల్పిస్తాయి. అయితే.. ఓ వ్యక్తి 20 నిమిషాలు లేటుగా ఆఫీసుకు రావటంతో ఉద్యోగం కోల్పోయాడు. అతను ఉద్యోగంలో చేరిన ఏడేళ్లలో ఇదే మొదటిసారి ఆలస్యం కావటం గమనార్హం. తన సహ ఉద్యోగి ఒకరు ఈ అంశాన్ని రెడిట్‌లో షేర్‌ చేశారు. అయితే.. ఈ సంఘటన ఎక్కడ జరిగిందనేది క్లారిటీ లేదు. 

రెడిట్‌లోని యాంటీవర్క్‌ ఫోరమ్‌లో ఈ పోస్ట్‌ను షేర్‌ చేశారు ఓ వ్యక్తి. సంస్థలో ఏడేళ్లకుపైగా పని చేస్తూ మొదటి సారి ఆలస్యమ్యయాడని, కేవలం 20 నిమిషాలు లేటుగా వచ్చినందుకు ఉద్యోగంలో నుంచి తొలగించారని పేర్కొన్నారు. ఆ వ్యక్తిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని మిగితా సిబ్బంది ఆందోళన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ‘అతడిని తిరిగి విధుల్లోకి తీసుకునే వరకు రేపటి నుంచి నేను, నా సహ ఉద్యోగులు ఆఫీసుకు లేటుగా రావాలని నిర్ణయించాం.’ అని పేర్కొన్నారు. 79వేల మంది దీనికి మద్దతుగా నిలిచారు. సంస్థ యాజమాన్యం నిర్ణయాన్ని చాలా మంది యూజర్లు తప్పుపట్టారు. ఆ ఉద్యోగిని ఉద్దేశపూర్వకంగానే తొలగించి తక్కువ జీతాన్ని పని చేసే వ్యక్తిని ఉద్యోగంలో చేర్చుకోవాలని సంస్థ భావించిన్లు కనిపిస్తోందని ఆరోపించారు.

ఇదీ చదవండి: ‘భార్య అలిగి వెళ్లిపోయింది.. సెలవు ఇవ్వండి ప్లీజ్‌’.. క్లర్క్‌ లేఖ వైరల్‌

మరిన్ని వార్తలు