వైరల్‌ పిక్‌: ట్రీ హట్‌

2 Jun, 2021 21:13 IST|Sakshi

బికనేర్‌: పర్యావరణాన్ని కాపాడటం, ప్రకృతితో మమేకం అవడం అంటే కొందరికి ఎంతో ఇష్టం. దాని కోసం ఏం చేసేందుకైనా వారు వెనుకాడరు. వారి ప్రయత్నాలు ఇతరులను అబ్బుర పరుస్తాయి, ఆకట్టుకుంటాయి, స్ఫూర్తిని నింపుతాయి. 

రాజస్థాన్‌లోని బికనేర్‌ జిల్లాకు చెందిన పంచు గగ్రామానికి యువకుడు తన ఇంటి సమీపంలో ఉన్న చెట్టుపైనే తన కోసం ప్రత్యేకంగా గదిని కట్టుకున్నాడు. రాజస్థాన్‌లో మండే ఎండల నుంచి ఈ చెట్టు గది ఎంతో ఉపశమనం అందిస్తోంది అంటున్నాడు. ఈ ట్రీ హట్‌కి సంబంధించిన ఫోటోలు ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి. 

మరిన్ని వార్తలు