వైరల్‌: విద్యార్థుల ప్రేమకు ముగ్ధులైన నెటిజన్లు

15 May, 2021 12:35 IST|Sakshi

సోషల్‌ మీడియా.. ప్రస్తుతం మనిషి జీవితంలో భాగమైపోయింది. మనుషులు తమ ఆలోచనలు, భావాలు, ఉద్వేగాలు, బంధాలను ప్రతిదీ సోషల్‌ మీడియాలోనే అధికంగా పంచుకుంటున్నారు. కాగా ఓ స్కూల్‌ టీచర్‌కి విద్యార్థులు బహూకరించిన డ్రెస్‌ ప్రస్తుతం నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. ఈ చిత్రంలో  క్లైర్ అనే టీచర్‌ చిరునవ్వు చిందిస్తుండగా.. ఆమె ధరించిన తెల్లని డ్రెస్‌పై పువ్వులు, రెయిన్‌బో, నక్షత్రాలను చూడవచ్చు. ఈ డ్రెస్‌ కింద ‘‘ఎమ్‌ఆర్‌ఎస్‌ కన్సోల్ట్ క్లాస్ 2020-2021’’ అని రాసి ఉంది. కాగా ఈ చిత్రాన్ని రెడిట్‌లో పోస్ట్‌ చేయగా.. 13 గంటల్లో లక్షల లైక్‌లు, కామెంట్స్‌ వచ్చాయి.

‘‘ఈ డ్రెస్‌ మీకు చాలా బాగుంది. మీరు విద్యార్థుల మనసు గెలుచుకున్న అద్భుతమైన గురువు అంటూ’’ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ‘‘మీ విద్యార్థులు తమ కళను అద్భుతంగా ప్రదర్శించారు.  ​మీరు వారిని ప్రేమతో ప్రోత్సహించడం చాలా సంతోషం.’’ అని​ మరో నెటిజన్‌ రాసుకొచ్చారు. అయితే ఇది ఎక్కడ జరిగిందనే దానిపై క్లారిటీ లేదు. కానీ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: చుట్టూ ఉన్నవాళ్లు ఏం చేస్తారో చూద్దామని ‘చనిపోయింది’!)

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు