ఈ సెక్యూరిటీ గార్డ్‌ పని చూస్తే ఎవరైనా శభాష్ అనాల్సిందే!

11 Apr, 2021 13:12 IST|Sakshi

ఈ హైటెక్‌ యుగంలో చదువు పెద్ద ఆర్భాటంగా తయారైంది. ఇష్టంతో కాకుండా ఇంట్లోవాళ్ల పోరు తట్టుకోలేక కష్టంగా చదువున్నవాళ్లే అధికం. అందులోనూ సకల సౌకర్యాలు కల్పిస్తేనే చదుకు కొనసాగిస్తామని తల్లిదండ్రులకు పోరు పెట్టే విద్యార్థులు ఎంతోమంది. కానీ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ ఫొటో మాత్రం చదవుకు కావల్సింది ఆసక్తి, శ్రద్ధ మాత్రమేనని చాటి చెబుతోంది. లక్ష్యాన్ని చేరకోవాలంటే కావాల్సింది ఏకాగ్రత, పట్టుదలేనని నిరూపిస్తూ ఓ యువకుడు తన ఉద్యోగ బాధ్యతను నిర్వర్తిస్తూనే తనకిష్టమైన చదువును కోనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్‌ చల్‌ చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.

తన కుటుంబానికి చదివించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఓ యువకుడు ఏటీఎం కేం‍ద్రంలో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. అయితే రాత్రి పూట కస్టమర్ల తాకిడి పెద్దగా ఉండదు కాబట్టి ఆ సమయంలో ఖాళీగా ఉండడం కన్నా చదువుకోవడం బెటర్‌ అని భావించాడు. ఇంకేముంది ఏటీఎం కేంద్రంలోనే చదవడం షురూ చేశాడు. చదవాలనే కోరిక ఉంటే చాలు కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకొని చదుకునే వీలుంటుందని నిరూపించాడు. 

ఈ ఫోటోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్ ఖాతా‌లో పోస్ట్‌ చేశారు. ఫోటోతో పాటు హిందీలో ఓ క్యాప్షన్‌ కూడా ఇచ్చారు. "హో కహిన్ భీ ఆగ్, ఆగ్ జల్ని చాయే’’ (నిప్పు ఎక్కడున్నా నిప్పే, ఎందుకంటే తన మండే స్వభావాన్నిమార్చుకోదు కాబట్టి). ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో ఇలాంటి విద్యార్థి ఉన్నాడా అంటూ కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు ‘నీ డెడికేషన్‌ లెవల్‌కి నా సలాం’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 
( చదవండి: నడి రోడ్డుపై ఈ అమ్మడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా )

మరిన్ని వార్తలు