ఈ వ్యక్తి పందెం కోసం ఏకంగా పాములతో...

14 Apr, 2021 15:07 IST|Sakshi

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఛాలెంజ్‌ల ట్రెండ్‌ నడుస్తోందని చెప్పాలి. మొన్నటి వరకు ఐస్‌ బకెట్‌ ఛాలెంజ్‌, ఫ్లిప్‌ ఛాలెంజ్‌లంటూ రకరకాల పేర్లతో ఇవి సోషల్ మీడియాలో హల్ చల్‌ చేశాయి. ఇందులో కొన్ని సెలబ్రిటీలను సైతం ఆకట్టుకొని వారిని కూడా పాల్గొనేలా చేశాయి. ఓ రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాను వాడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతుండడం, ఇలాంటి ఛాలెంజ్‌లు నెటిజన్లను ఆకట్టుకోవడంతో కొత్తవి పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా మరో కొత్త ఛాలెంజ్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. అయితే, ఈ ఛాలెంజ్లో డబ్బులు కూడా మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ఛాలెంజ్‌ అంత సులువని మాత్రం అనుకోకండి.

ఛాలెంజ్‌లో పాల్గొంటే..మనీ మీ సొంతం
చాలెంజ్‌ ఏమనగా.. పాములతో ఉన్న ఓ బాత్‌ టబ్‌లో 30 సెకండ్లు గడిపితే ఏకంగా రూ.7 లక్షలను బహుమతిగా అందిస్తున్నాడు ఈ ప్రముఖ యూట్యూబర్‌ మిస్టర్‌ బీస్ట్‌. ఇదొక్కటే కాదండోయ్‌ ఈ లిస్ట్‌లో మరిన్ని మన కోసం ఉన్నాయి. ఒక గాజు బాక్సులో డబ్బులను పెట్టి అందులో పెద్ద సైజు బొద్దింకలను వేశాడు. వాటిని తాకకుండా ఎంత డబ్బు తీసుకుంటే అంత మనదేనంటూ మరో ఛాలెంజ్‌ విసిరాడు. సాలీడులను శరీరంపై పారించడం, భరించలేని వాసన వస్తున్న కుళ్లి పోయిన కాయగూరల టబ్‌లో పడుకోవడం లాంటి చిత్ర విచిత్రమైన ఛాలెంజ్‌లతో యూట్యూబ్‌లో హల్చల్‌ చేస్తున్నాడు‌. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారడమే కాకుండా, ఏకంగా రెండు కోట్లకుపైగా వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. టై  చేయాలనుకునే వారు చేయండి. పాములంటే భయపడే వాళ్లు మాత్రం ఈ ఛాలెంజ్‌కు జర దూరంగా ఉండండి.

( చదవండి: ఈ సెక్యూరిటీ గార్డ్‌ పని చూస్తే ఎవరైనా శభాష్ అనాల్సిందే!

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు