870 కిలోమీటర్లు ప్రయాణం చేసిన పాము..! తీరా చూస్తే

17 Apr, 2021 23:45 IST|Sakshi

కాన్‌బెర్రా: కిచెన్‌లోకి పాము ప్రత్యక్షమైన సంఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి చెందిన ఓ వ్యక్తికి ఎదురైంది. సిడ్నీకి చెందిన అలెక్స్‌ వైట్‌ ఒకరోజు సూపర్‌మార్కెట్‌కు వెళ్లి సరుకులను తీసుకొని వచ్చాడు. ఇంటికి వచ్చాక సరుకులను తీస్తుండగా ఒక్కసారిగా ఖంగు తిన్నాడు. అతడు తెచ్చిన పాలకూర ప్యాకెట్‌లో పాము ప్రత్యక్షమైంది. పాము బుసలు కొట్టడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. దీంతో అలెక్స్‌ భయపడిపోయి  ప్యాకెట్‌ను దూరంగా విసిరేశాడు. అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆ పామును తీసుకొని వెళ్లారు. ఒకవేళ ఆ పాము కాటువేసి ఉంటే తీవ్రమైన పరిణామాలు ఉండేవని వైర్స్‌ రెస్యూ సిబ్బంది తెలిపారు. 

కాగా, అలెక్స్‌ వైట్‌ ఈ విషయాన్ని సూపర్‌ మార్కెట్‌ యాజమన్యానికి తెలిపాడు. పాము సూపర్ మార్కెట్లోకి ఎలా ప్రవేశించిందో అనే విషయాన్ని పరిశీలించగా, ఆస్ట్రేలియాలోని తూవూంబా నగరంలో ఒక ప్యాకింగ్ ప్లాంట్ నుంచి సిడ్నీకి 870 కిలోమీటర్లు పాము ప్రయాణం చేసినట్లు అధికారులు చెప్పారు. ప్యాక్ చేసిన ఉత్పత్తులలో మొదటిసారి పామును చూశామని స్థానిక సిబ్బంది తెలిపారు. అంతేకాకుండా ప్యాకింగ్‌ చేసిన కూరగాయల్లో తరచూ కప్పలు రావడం అక్కడ సర్వసాధారణమే.

చదవండి: వైరల్‌: ఏనుగు డాన్స్ చూస్తే నవ్వకుండా ఉండలేం!

మరిన్ని వార్తలు