ఏనుగుపై దాడి.. మీరు మనుషులా రాక్షసులా!

22 Feb, 2021 13:36 IST|Sakshi

కోయంబత్తూరు: నోరు లేని జంతువులపై దాడులు చేయడం మనుషులతో పాటు వాటికి శిక్షణ ఇచ్చేవారికి కూడా ఓ అలవాటుగా మారిపోతోంది. జంతు ప్రేమికులు ఎన్ని ఆందోళనలు చేపట్టినా మనుషుల్లో మార్పు రావటం లేదు. ఇలాంటి ఓ ఘటన కోయంబత్తూరులో చోటు చేసుకుంది. ఇద్దరు ఏనుగు మావటిలు ఓ ఏనుగును విక్షణరహితంగా కర్రలతో కొట్టారు. దానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా‌ మారింది. వివరాల్లోకి వెళ్లితే.. శ్రీవిల్లిపుత్తూరులోని ఆండల్ ఆలయానికి చెందిన 19 ఏళ్ల ఆడ ఏనుగు ‘జయమల్యత’ను మావటిలు వినీల్ కుమార్‌, శివప్రసాద్ గోలుసులతో చెట్టుకు కట్టేసి మరీ కర్రలలో విపరీతంగా కొట్టారు. దిక్కుతోచని ఆ ఏనుగు ఆ దెబ్బల నొప్పికి అరుస్తూ విలపించింది.

మావటీలు చెప్పినట్లుగా ఏనుగు వినకపోవడంతో దాని ప్రవర్తన వారికి నచ్చక కోపంతో ఈ దాడికి దిగినట్లు తెలుస్తోంది. అయితే నోరు లేని ఏనుగుపై అలా కర్రలతో దాడి చేయడం సరికాదని జంతుప్రేమికులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ వీడియోను తమ దృష్టికి వచ్చిందని ఏగునుపై దాడి చేసిన మావటిల సస్పెన్షన్‌ పెండింగ్‌లో ఉందని హెచ్‌ఆర్‌అండ్‌ఈసీ(హిందూ రిలిజియస్ అండ్ ఛారిటబుల్ ఎండోమెంట్స్)అధికారులు తెలిపారు. తమిళనాడు, పుదుచ్చేరిలోని వివిధ దేవాలయాలు, మఠాల నుంచి 26 ఏనుగుకు రెండు నెలల పాటు శిక్షణ ఇవ్వాలని కోయంబత్తూరు జిల్లాలోని తేకంపట్టికి తీసుకువచ్చారు. ఏనుగు దాడి వీడియో సోషల్‌ మీడియాలో చూసిన నెటిజన్లు.. ‘ఏనుగుపై దాడి దారుణం, మీరు మనుషులా రాక్షసులా, మీలో మానవత్వం చచ్చిపోయింది, దాడిచేసిన వారిని కఠిన చర్యలు తీసుకోవాలి’ అని కామెంట్లు చేస్తున్నారు.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు