చిన్నారితో పిల్ల జింక..వీడియో వైరల్‌

4 Dec, 2020 11:50 IST|Sakshi

అడవి నుంచి తప్పిపోయిన పిల్ల జింకతో ఓ చిన్నారి ఆడుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గంటల వ్యవధిలోనే ఈ క్యూట్‌ వీడియోకి నెటిజన్లు వేలకొద్ది లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సమీప పరిసరాల్లోని అడవి నుంచి త‍ప్పిపోయిన పిల్ల జింక జనావాసంలోకి వచ్చింది. బిక్కుబిక్కుమంటూ ఓ చెత్తడబ్బా వెనక దాకొన్న జింక అటుగా వెళ్తున్న చిన్నారిని చూసి బయటకు వచ్చింది. అయితే అకస్మాత్తుగా జింక కనిపించేసరికి మొదట భయపడ్డ ఆ చిన్నారి కాసేపటికి దాన్ని ప్రేమగా నిమురుతూ సరదాగా ఆడుకుంది.  15 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోను ఇప్పటికే 11,000మంది చూసి రీట్వీట్లు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు