నేను సూపర్‌ హ్యాపీ: నటి వరలక్ష్మి

5 Dec, 2020 13:42 IST|Sakshi

చెన్నై: సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటీమణుల్లో దక్షిణాదికి చెందిన వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ఒకరు. అయితే తాజాగా వరలక్ష్మి ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లు డిసెంబర్‌ 2వ తేదీన హ్యాకింగ్‌ బారిన పడ్డాయి. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. సోషల్‌ మీడియాలో తన పేరు మీద ఏమైనా పోస్టులు వస్తే జాగ్రత్తగా ఉండాలని అభిమానుల్ని కోరారు. అయితే తాజాగా వరలక్ష్మి శరత్‌కుమార్‌ ట్విటర్‌ ఖాతా తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె ట్విటర్‌ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: ‘తలైవి’ వర్ధంతి : కంగనా స్టన్నింగ్‌ స్టిల్స్‌)

మళ్లీ ఇంత త్వరగా రీ ఎంట్రీ ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. మనం సోషల్‌ మీడియాలో బతుకుతున్నాం, ఇక్కడ ఏమైనా జరగొచ్చు కానీ అదంతా నిజం కాదని, మనం చూసిన ప్రతీదాన్ని నమ్మకూడదని ట్విటర్‌లో పేర్కొన్నారు. వరలక్ష్మి ప్రస్తుతం తమిళ్‌, తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా, విలన్‌ క్యారెక్టర్లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగులో రవితేజ హీరోగా వస్తున్న క్రాక్‌ సినిమాలో వరలక్ష్మి నటించనున్నారు.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా