కరోనా వివాహం: నిజంగంటే ఇది బొంగుల పెళ్లి..

5 May, 2021 16:45 IST|Sakshi

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తోంది. పెద్ద ఎత్తున కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. ఈ సమయంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు వద్దన్నా జరుగుతూనే ఉన్నాయి. అయితే కరోనా నేపథ్యంలో కొత్త తరహాలో వివాహాలు జరుగుతున్నాయి. మొన్న ఒకచోట పీపీఈ కిట్లు ధరించి ఓ జంట వివాహం చేసుకోగా.. నిన్న మై విలేజ్‌షో నటుడు అనిల్‌ వినూత్నంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ జంట మరీ కొత్తగా చేసుకున్నారు.

బొంగుల పెళ్లి అని ఎవరైనా అంటారు. ఇక్కడ అదే నిజమైంది. పెళ్లికొడుకు, పెళ్లికూతురు బొంగుల సహాయంతో ఒకరినొకరు దండలు మార్చుకున్నారు. బొంగులు అంటే వెదురు కర్రలు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పెళ్లిని అత్యంత జాగ్రత్తల నడుమ చేసుకున్నారు. అందంగా ముస్తాబు చేసిన కల్యాణ మండపంపై అంతే అందంగా ముస్తాబైన వధూవరులు ముఖానికి మాస్క్‌లు ధరించారు. పెళ్లికి వచ్చినవారు కూడా మాస్క్‌లు ధరించి.. భౌతిక దూరం పాటిస్తూ హాజరయ్యారు. 

అయితే దండలు మార్చుకునే సమయంలో వెదురు కర్రలు ఉపయోగించారు. కర్రల సహాయంతో వరుడు వధువు మెడలో.. ఆమె అతడి మెడలో దండలు వేసుకున్నారు. కొత్తగా దండలు మార్చుకున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు దీన్ని చూసి నవ్వుతుండగా.. మరికొందరు ఇప్పుడు అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. ‘ఇదేం పెళ్లి రా నాయన. కొన్నాళ్లు ఆగలేకపోయావా?’ ఒకరు, ‘మరి పిచ్చి ముదిరింది’ అని మరొకరు కామెంట్స్‌ చేస్తున్నారు.

చదవండి: ఆక్సిజన్‌ కొరత లేదు.. కరోనా కంట్రోల్‌లోనే
చదవండి: 10 రోజుల కష్టంతో తండ్రి శవం సాధించిన బాలుడు
 

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు