ఇంట్లో ప్రయత్నించకండి.. కాలిపోద్ది!

26 Oct, 2020 14:37 IST|Sakshi

వంట చేసేటప్పుడు కొద్దిగా నూనె చిట్లి చేతుల మీద పడితే ఎంత మంట పుడుతుందో కదా. మరోసారి కిచెన్‌లో అడుగుపెట్టకూడదు అనుకుంటాము. నూనె చిట్లుతుందనే భయంతోనే చాలా మంది పిండి వంటలు చేయడం వంటి వాటి జోలికి పోరు. రెండు మూడు చుక్కల నూనె మీద పడితేనే బాధతో విలవిల్లాడతామే.. ఏకంగా సలసల కాగే నూనేలో చేతిని ముంచితే.. ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది కదా. అలాంటిది ఈ న్యూస్‌ చదివి.. వీడియో చూశాక ఇంకేమంటారో మరి. ఓ నడి వయసు మహిళ  చేతిని చాలా ఈజీగా.. చిల్లుల గరిటే మాదిరి బాగా మరుగుతున్న నూనెలో ముంచి తీస్తుంది. ఆమెకు చిన్న గాయం కూడా కాలేదు. నమ్మబుద్ది కాకపోయినా ఇది నిజం. ఫస్ట్‌ వి ఫీస్ట్‌ అనే ట్విట్టర్లో అకౌంట్‌లో షేర్‌ చేసిన ఈ టిక్‌టాక్‌ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. (చదవండి: 516కు పైగా ఆపరేషన్స్‌.. అయినా కానీ..)

‘షి సేడ్‌ టంగ్స్‌ ఆర్‌ ఫర్‌ లూజర్స్’‌ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియోలో ఓ నడి వయసు మహిళ పెద్ద బాండీ ముందు నిల్చుని ఉంది. దానిలో నూనె బాగా మరుగుతుంది. బజ్జీలు వంటి స్నాక్‌ ఐటెం తయారు చేస్తుంది. పిండిలో ముంచిన మిరపకాయల్ని నూనెలో వేస్తుంది. ఫ్రై అయిన వాటిని పక్కకు జరపడానికి చిల్లుల గరిటే, పట్టుకారు లాంటివి వాడకుండా చేతితోనే పక్కకు జరుపుతుంది. బాగా మరిగిని ఆ నూనెని చేతిలోకి తీసుకుని దానిలో పోయడం చూడవచ్చు. రెండు సార్లు మరిగే నూనెలో చేయి పెట్టినా ఆమెకు ఏం కాలేదు. ఆ తర్వాత ఓ ఎడిటెడ్‌ పటుకారు ఫ్రేమ్‌లోకి వచ్చి.. బహుశా నేను ఇక్కడ లేను.. నేను కేవలం ఓ భ్రమను మాత్రమే అనడం చూడవచ్చు. సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇప్పటికే దీన్ని 16కే మంది చూశారు. చాలా మంది ఇంకా ఆశ్చర్యంలోనే ఉన్నామని.. ఆమె అవతార్‌ ఆఫ్‌ ఆయిల్‌ బెండర్‌ అని.. ఇలాంటి వీడియో నెవ్వర్‌ బీఫోర్‌ నెవ్వర్‌ ఆఫ్టర్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఆమె చేతికి ఉన్న పిండి కాలకుండా కాపాడుతుంది అంటున్నారు.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు