సంగీత మమకారం

17 Sep, 2023 00:56 IST|Sakshi

క్షణం తీరిక లేని పనుల్లో అభిరుచులు చిన్నబోతుంటాయి. ఎందుకంటే సమయాభావం వల్ల వాటి జోలికి వెళ్లం. అయితే పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన అభిరుచుల విషయంలో రాజీ పడదు. సమయం చేసుకొని, చూసుకొని వాటికి న్యాయం చేస్తుంది.

దీదీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రసంగించే వక్త మాత్రమే కాదు బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ కూడా. చక్కగా ఆడుతుంది. కవిత్వం రాస్తుంది. పాటలు పాడుతుంది. బొమ్మలు గీస్తుంది. ఆమె మానసిక బలానికి ఈ సృజనాత్మక శక్తులే కారణం కావచ్చు.

అధికార పర్యటనలో భాగంగా ఇటీవల స్పెయిన్‌కు వెళ్లిన మమతా బెనర్జీ, ఒకవైపు సమావేశాలలో పాల్గొంటూనే మరోవైపు తనలోని ఆర్టిస్ట్‌ను అధికారులకు పరిచయం చేసింది. పియానోపై రవీంద్రుడి సంగీతాన్ని వినిపించింది. అంతకుముందు మాడ్రీడ్‌ వీధుల్లో అకార్డియన్‌పై ‘హమ్‌ హోంగే’ గీతాన్ని ప్లే చేసింది. ఈ వీడియోలు ఇంటర్నెట్‌లో సందడి చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు