హెల్మెట్‌​ను చాక్లెట్‌లా మింగేసిన ఏనుగు.. వీడియో వైరల్

10 Jun, 2021 12:38 IST|Sakshi

దిస్పూర్: సాధారణంగా ఏనుగంటే అందరికి ఇష్టమైన జంతువే. మావటివారు దాన్ని తీసుకొని నగరాలలో, గ్రామాలలో తిప్పుతుంటారు. ఈ క్రమంలో, పిల్లలు దానిపై ఎక్కడానికి ఇష్టపడతారు. అదే విధంగా,  దానికి అరటి పండో.. మరేదైన ఫలమో పెట్టి తెగ సంబర పడిపోతుంటారనే విషయం తెలిసిందే. అయితే, ఏనుగు కూడా, ఆఫలాన్నితిని తన తోండంతో వారిని ఆశీర్వదిస్తుందని తెలుసు. అయితే, అస్సాంలో ఒక ఏనుగు చేసిన వెరైటీ పని ఇప్పుడు సోషల్​ మీడియాలో  వైరల్​గా మారింది. 

వివరాలు.. ఈ సంఘటన గువహతిలోని సత్​గావ్​ ఆర్మీ క్యాంపులో చోటుచేసుకుంది. ఈ ఆర్మీ క్యాంపు అడవికి సమీపంలో ఉంది. అయితే, ఏలా వచ్చిందో..  కానీ, ఒక  గజరాజు అడవి నుంచి ఆర్మీ క్యాంపు వైపు వచ్చింది. అది పార్కింగ్​ చేసి ఉన్న బైక్​ దగ్గరకు  చేరుకుంది. అక్కడ, బైక్​కు తగిలించి ఉన్న హెల్మేట్​ను తోండంతో తీసుకుంది. దాన్ని పట్టుకుని వింతగా చూసింది.

ఇదంతా గమనిస్తున్న కొంత మంది అధికారులు ఏనుగు  దాన్ని కిందపడేసి తొక్కేస్తుందని భావించారు. కానీ ఆ ఏనుగు మాత్రం.. తోండంతో ఆ హెల్మేట్ ను​ అమాంతం నోట్లో వేసుకొని గుటుక్కున తినేసింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది. అయితే , దీన్ని చూసిన నెటిజన్లు.. ‘పాపం... గజరాజుకి ఏంత ఆకలేసిందో..’, ‘ బహుషా.. వెలగ పండు అనుకొని ఉంటుంది కాబోలు..’, ‘ హెల్మెట్​ లేదు.. ఇక ఎలా బయటకు ఎలా వెళ్తావు’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 

చదవండి: ఎంత పని చేశావమ్మా... ఏనుగు!

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు