ఆ సూట్‌కేస్‌ను చూడకపోతే ఏం జరిగేది?

23 Sep, 2020 12:15 IST|Sakshi

భారత్‌లో సినిమాలతో పాటు సీరియల్స్‌కు కూడా ఎంతో క్రేజ్‌. సోమవారం నుంచి శనివారం వరకూ రోజులో దాదాపు 10 గంటలపాటే సీరియల్స్‌ టెలికాస్ట్‌ అవుతాయంటేనే అర్థం చేసుకోవచ్చు. అయితే సీరియల్స్‌లో కొన్ని సీన్‌లు చూస్తే.. పిచ్చెక్కిపోతుంది. వీసమెత్తు లాజిక్‌ కూడా ఉండదు. తాజాగా ఓ సీరియల్‌ సీన్‌ సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. నెటిజనులు రకరకాల ప్రశ్నలు కురిపిస్తున్నారు. అదేంటో మీరు చూడండి. కలర్స్‌ టీవీలో ప్రసారం అయ్యే ఇష్క్‌‌ మెయిన్‌ మార్జావన్‌ 2లోని ఓ సన్నివేశానికి సంబంధించిన వీడియో ఇది. దీనిలో రిధిమా (నటి హెల్లీ షా ఈ పాత్ర పోషించినది) కాళ్లకు సూట్‌కేస్‌ తగిలి ముందుకు తూలి పడుతుంది. దాంతో గోడకు గుద్దుకుంటుంది. స్పృహ కోల్పోయి సూట్‌కేస్‌లో పడుతుంది.(చదవండి: ఖాళీ కుక్కర్‌ను గ్యాస్ స్టౌ‌పై పెట్టింది ఎవరు?)

ఇంతలో వైట్‌ హ్యాండ్‌ గ్లౌజులు ధరించిన ఓ వ్యక్తి ఆ సూట్‌కేస్‌ని తీసుకెళ్లి స్విమ్మింగ్‌ ఫూల్‌లో పడేస్తాడు. ఇంతలో వంశ్‌(రాహుల్‌ సుధీర్‌) సూట్‌కేస్‌ స్విమ్మింగ్‌ ఫూల్‌లో మునిగిపోవడం గమనిస్తాడు. ఇక్కడితో వీడయో అయిపోతుంది. అయితే దీనిపై నెటిజనులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అసలు సూట్‌కేస్‌ చూడకపోయుంటే ఏం జరిగేది.. దాని జిప్‌ ఎవరు పెట్టారు.. వచ్చే ఏడాది నవంబర్‌లో ఆ సూట్‌కేస్‌ పూర్తిగా మునిగిపోతుంది.. 200 ఎపిసోడ్ల తర్వాత ఆమెకు ఏం జరిగిందో చెప్పండి అంటూ ఫన్ని కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజనులు. 

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు