వైరల్‌ వీడియో: రికార్డు మధ్యలో దెయ్యం

1 Oct, 2020 16:09 IST|Sakshi

మీరు వీడియో రికార్డు చేస్తున్న సమయంలో మీ వెనుక కర్టన్‌లో ఎవరో ఉన్నట్లు అనిపిస్తే మీరు ఏం చేస్తారు. భయపడతారా, ఏడుస్తారా, లేదా అక్కడి నుంచి పరిగెత్తి వెళ్లిపోతారా? సాధారాణంగా జనాలు ఈ మూడింటిలో ఏదో ఒకటి చేస్తారు. కానీ ఈ వీడియోలో మీరు చూడబోయే ఈ మహిళ మాత్రం అందుకు భిన్నంగా చేసింది. పరుగెత్తుకుంటూ వెళ్లి మనిషి కదిలినట్టుగా ఉన్న చోట ఒక పంచ్‌ గుద్దింది. తరువాత డోర్స్‌ అ‍న్ని వేసేసింది. 

అసలు ఏం జరిగిందంటే అన్నా బనానానా.. అనే మహిళ తన డైలీ వ్లాగ్‌లో ఒక డ్రింక్‌ గురించి వివరించడం కోసం వీడియో రికార్డు చేయడం మొదలు పెట్టింది. ఇంతలో ఆమె వెనకాల ఉన్న కర్టన్‌లో ఎవరో ఉన్నట్లు కదిలింది. కెమెరాలో నుంచి దాన్ని చూసిన మహిళ వెంటనే అక్కడకు పరుగున వెళ్లి ఒక పంచ్‌ గుద్దింది. అయితే అక్కడ ఎవరు లేరు. గాలికి అలా జరిగింది. అయితే అక్కడ ఏదైనా దెయ్యంలాంటిది ఉందని ఆమె భయపడిందో ఏమో కానీ ఆ తరువాత వెంటనే తెరిచి ఉన్న గాజు అద్ధాలను మూసివేసింది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆమె ధైర్యాన్ని మెచ్చకుంటున్నారు. మనం అందరం ఎప్పుడూ ఫైట్‌ మోడ్‌లో ఉంటామని అన్నా మాత్రం ఫైట్‌ చేసేసింది అని కామెంట్‌ చేస్తున్నారు. మరికొంత మంది ఆమె స్నేహితులెవరైనా అలా చేసి కనిపించకుండా వెళ్లిపోయారేమో సరిగా చూడండి అని అంటున్నారు. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

చదవండి: ఎద్దు నుంచి నాన్నమ్మను కాపాడిన బుడతడు

మరిన్ని వార్తలు