India vs Sri Lanka: ధావన్‌ ధమాకా.. ఒక్క వన్డే 10 రికార్డులు

19 Jul, 2021 16:22 IST|Sakshi

ముంబై: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో  టీమిండియా 7 వికెట్ల తేడాతో  ఘనవిజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో ధావన్‌ సారధ్యంలో  టీమిండియా యువ క్రికెటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. దీంతో ఈ మ్యాచ్‌లో 10 కొత్త రికార్డులు నమోదయ్యాయి.
 
ఆ 10 రికార్డులు ఏంటంటే..
► తొలి వన్డే భారత్, శ్రీలంక మధ్య 160 వ వన్డే  మ్యాచ్ కాగా, శ్రీలంకపై 92 విజయాలు నమోదు చేసి కొత్త రికార్డును నమోదు చేసుకున్నది భారత్‌. పాకిస్తాన్‌ కూడా శ్రీలంకపై 155 మ్యాచులు ఆడి 92 విజయాలు నమోదు చేసుకున్నది. అయితే  పాకిస్తాన్‌ పేరిట ఉన్న రికార్డును టీమిండియా సమం చేసింది.

శ్రీలంకను 9 వరుస మ్యాచుల్లో ఓడించి టీమిండియా కొత్త రికార్డు నమోదు చేసింది. ఈ ఘనత ఇంతవరకు ఏ జట్టు  సాధించలేదు. గతం లో 4 వరుస మ్యాచుల్లో గెలుపొంది దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉంది.

అంతర్జాతీయ క్రికెట్‌లో  శిఖర్‌ ధావన్‌ 10 వేల పరుగులు  పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన ధావన్ భారత్‌ నుంచి 14 వ బ్యాట్స్ మాన్ గా రికార్డు నమోదు చేశాడు. సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. శ్రీలంకతో తొలి వన్డేలో శిఖర్‌ ధావన్‌ 95 బంతులు ఆడి 86 పరుగులు చేశాడు

శిఖర్ ధావన్ తన వన్డే కెరీర్‌లో 50 వ సారి 50 కి పైగా పరుగులు సాధించాడు. గబ్బర్‌ ఇప్పటివరకు వన్డేల్లో 33 అర్ధ సెంచరీలు, 17 సెంచరీలు చేశాడు. ఇటువంటి ఘనత సాధించిన 10వ భారత ఆటగాడు గా ధావన్‌ నిలిచాడు. సచిన్‌ టెండూల్కర్ అందరికన్నా ముందున్నాడు.

తొలి వన్డేలో 23 వ పరుగులు చేయగానే శిఖర్‌ ధావన్‌ వన్డేల్లో 6 వేల పరుగులు పూర్తి చేసుకుని గంగూలీని వెనక్కి నెట్టాడు. తక్కువ వన్డేల్లో 6 వేల పరుగులు పూర్తిచేసిన నాలుగో ఆటగాడిగా శిఖర్‌ ధావన్‌ నిలిచాడు. సౌరవ్‌ గంగూలీ 147 ఇన్నింగ్స్‌లో 6 వేల పరుగులు చేయగా, శిఖర్‌ 141 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించాడు. 123 ఇన్సింగ్స్‌ల్లో వేగంగా 6 వేల పరుగులు పూర్తి చేసి హషీం ఆమ్లా తొలి స్థానంలో ఉన్నారు.
 
శ్రీలంకపై అతి తక్కువ ఇన్నింగ్స్ లో 1000 పరుగులు మైలురాయిని చేరిన రికార్డును కూడా  ధావన్ తన పేరిట నమోదు చేసుకున్నాడు. శ్రీలంకపై శిఖర్‌ 17 ఇన్నింగ్స్‌లు ఆడి వేగంగా వేయి పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచి దక్షిణాఫ్రికా క్రికెటర్‌ హషీం ఆమ్లా రికార్డును బద్దలు కొట్టాడు.


కెప్టెన్‌గా ఆడిన తొలి వన్డేలో 50 ప్లస్‌ పరుగులు చేసిన శిఖర్‌ ధావన్‌ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. కెప్టెన్‌గా ఆడిన తొలి వన్డేలోనే 50 ప్లస్‌ పరుగులు చేసిన ఐదో భారతీయ క్రికెటర్‌గా శిఖర్‌ నిలిచాడు. ధావన్‌  కన్నా ముందు అజిత్‌ వాడేకర్‌, రవిశాస్త్రి, సచిన్‌, అజయ్‌ జడేజా ఉన్నారు. 

ఇదే వన్డేలో అరగేంట్ర మ్యాచ్‌లోనే ఇషాంత్‌ కిషన్‌  కొత్త రికార్డును తన పేరిట రాసుకున్నాడు. ఒకే ఏడాదిలో వన్డేతోపాటు టీ20 లో హాఫ్‌ సెంచరీ చేసిన అరగేంట్ర రెండో భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో 42 బంతులను ఎదుర్కొన్న ఇషాంత్‌ కిషన్‌ 59 పరుగులు చేశారు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 లో ఇషాంత్‌ కిషన్‌ హాఫ్‌ సెంచరీ చేశాడు.

పవర్‌ ప్లేలో అత్యధిక  పరుగులు నమోదు చేసిన జట్టుగా ఇండియాకు కొత్త రికార్డు నమోదు చేసింది. తొలి 10 ఓవర్లలో ఇండియా వికెట్‌ నష్టపోయి 91 పరుగులు చేసింది. 2013 నుంచి ఇదే అత్యధిక  స్కోర్‌. 2019 లో వెస్టిండీస్‌పై పవర్‌ ప్లేలో ఇండియా 83 పరుగులు చేసింది.

ఏ ఒక్క బ్యాట్స్‌మెన్‌ కూడా  అర్ధ సెంచరీ చేయకుండా శ్రీలంక  అత్యధిక స్కోర్‌ నమోదు చేయడం ఇదే మెదటి సారి. 9 వికెట్లు కోల్పోయి శ్రీలంక 262 పరుగులు చేసింది. గతంలో హాఫ్‌ సెంచరీలు లేకుండా శ్రీలంక జట్టు (పాకిస్తాన్‌ జట్టుపై 2006లో ) 253 పరుగులు చేసింది.
 

మరిన్ని వార్తలు