చైనాలో 11 అంతర్జాతీయ టెన్నిస్‌ టోర్నీలు రద్దు 

25 Jul, 2020 01:33 IST|Sakshi

డబ్ల్యూటీఏ, ఏటీపీ ప్రకటన

వాషింగ్టన్‌: చైనాలో జరగాల్సిన పలు అంతర్జాతీయ టెన్నిస్‌ టోర్నీలపై కరోనా ప్రభావం చూపింది. ఈ దెబ్బకి సీజన్‌ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌తో పాటు మరో 10 టోర్నీలను రద్దు చేస్తున్నట్లు ఏటీపీ, డబ్ల్యూటీఏ వర్గాలు శుక్రవారం ప్రకటించాయి. దీంతో చైనా వేదికగా అక్టోబర్‌–నవంబర్‌ మధ్య పురుషుల, మహిళల విభాగాల్లో జరగాల్సిన మొత్తం 11 టోర్నీలు రద్దు అయ్యాయి. ఇందులో ఏడు మహిళల విభాగంలో (చైనా ఓపెన్, వుహాన్, జియాంగ్జి , జెంగ్‌జూ  డబ్ల్యూటీఏ ఫైనల్స్, గ్వాంగ్‌జూ, జుహై ఓపెన్‌) ఉండగా... మిగతా నాలుగు (చైనా ఓపెన్, షాంఘై మాస్టర్స్‌ సిరీస్, చెంగ్డూ, జుహై ఓపెన్‌) పురుషుల విభాగానికి చెందినవి. చైనా ప్రభుత్వ క్రీడా పాలకుల సూచనల ప్రకారమే ఏటీపీ, డబ్ల్యూటీఏ ఈ నిర్ణయం తీసుకున్నాయి. 

>
మరిన్ని వార్తలు