IND VS SL 2nd Test: పింక్‌ బాల్‌ టెస్ట్‌ల్లో సరికొత్త రికార్డు.. తొలి రోజు ఏకంగా..!

12 Mar, 2022 22:23 IST|Sakshi

India vs Sri Lanka, pink-ball Test Day 1 highlights: పింక్‌ బాల్‌తో జరిగే డే అండ్‌ నైట్‌ టెస్ట్‌ల్లో సరికొత్త రికార్డు నమోదైంది. ఈ ఫార్మాట్‌లో బెంగళూరు వేదికగా భారత్‌-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి రోజు ఆటలో ఏకంగా 16 వికెట్లు నేలకూలాయి. పింక్‌ బాల్‌ టెస్ట్‌ మ్యాచ్‌ల చరిత్రలో తొలి రోజే ఇన్ని వికెట్లు కూలడం ఇదే ప్రధమం. 2017లో సౌతాఫ్రికా, జింబాబ్వేల మధ్య మ్యాచ్‌లో 13 వికెట్లు, 2018లో న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ మ్యాచ్‌లో 13, 2019లో భారత్‌, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో 13, 2021 భారత్‌, ఇంగ్లండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌లో 13 వికెట్లు తొలి రోజే పడ్డాయి. ఈ ఐదు సందర్భాల్లో మూడింటిలో టీమిండియా భాగం కావడం విశేషం. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌట్‌ కాగా, తొలి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ (92) ఒంటరి పోరాటం చేయడంతో భారత్‌ గౌరవప్రదమైన స్కోర్‌ చేసింది. లంక బౌలర్లలో లసిత్‌ ఎంబుల్దెనియా, ప్రవీణ్‌ జయవిక్రమ తలో 3 వికెట్లు, ధనంజయ డిసిల్వా 2,  సురంగ లక్మల్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. మయాంక్‌ అగర్వాల్‌  రనౌటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక భారత బౌలర్లు బుమ్రా (3/15), షమీ (2/ 18), అక్షర్‌ పటేల్‌ (1/21)ల  ధాటికి విలవిలలాడింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఏంజలో మాథ్యూస్‌ ధాటిగా ఆడి 43 పరుగులు చేయడంతో లం‍క జట్టు ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
చదవండి: మాతృదేశంపై సెంచరీ.. ఆసీస్‌ బ్యాటర్‌ అరుదైన ఘనత

మరిన్ని వార్తలు