IND Vs PAK Asia Cup 2022: టీమిండియా పేసర్ల సరికొత్త రికార్డు.. టి20 క్రికెట్‌లో ఇదే తొలిసారి 

28 Aug, 2022 22:02 IST|Sakshi

ఆసియాకప్‌లో భాగంగా టీమిండియా, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న రోహిత్‌ నిర్ణయానికి టీమిండియా బౌలర్లు న్యాయం చేశారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ 19.4 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్‌ అయింది. అయితే ఇక్కడ విశేషమేమిటంటే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా తీసిన 10 వికెట్లు పేసర్లే పంచుకున్నారు. భువనేశ్వర్‌ కుమార్‌ 4, హార్దిక్‌ పాండ్యా 3, అర్షదీప్‌ సింగ్‌ 2, ఆవేశ్‌ ఖాన్‌ ఒక వికెట్‌ తీశారు.

►టీమిండియా తరపున టి20 క్రికెట్‌లో అన్ని వికెట్లు పేసర్లు తీయడం ఇదే మొదటిసారి. ఇంతకముందు ప్లొరిడాలో వెస్టిండీస్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో టీమిండియా నుంచి అన్ని వికెట్లు స్పిన్నర్లు పడగొట్టారు. 
►ఇక భువనేశ్వర్‌ కుమార్‌ టి20ల్లో పాకిస్తాన్‌పై కెరీర్‌ బెస్ట్‌ నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్‌ 4 ఓవర్లు వేసి 26 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. 
►టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఆసియాకప్‌లో పాకిస్తాన్‌పై రెండోసారి మూడు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన హార్దిక్‌ 25 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఇంతకముందు 2016లో 3.3 ఓవర్లలోనే 8 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు.

చదవండి: IND Vs PAK Fakhar Zaman: ప్రత్యర్థివైనా మెచ్చుకోకుండా ఉండలేం..

Asia Cup 2022 IND Vs PAK: రోహిత్‌ తప్పు చేశాడా!.. పంత్‌ను పక్కనబెట్టడంపై విమర్శలు

మరిన్ని వార్తలు