IPL 2022: అప్పుడు సీఎస్‌కేకు చుక్కలు చూపించారు.. కట్‌ చేస్తే.. ఇప్పుడేమో ఏకంగా

15 Mar, 2022 15:33 IST|Sakshi

ఐపీఎల్‌ చరిత్రలో  చెన్నై సూపర్ కింగ్స్ తిరగులేని జట్టుగా నిలిచిన జట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 12 సీజన్లలో 11 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరి చెన్నై రికార్డును సృష్టించింది. ఎంస్‌ ధోని సారథ్యంలోని సీఎస్కే డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఐపీఎల్‌-2022 బరిలోకి దిగనుంది. ఇక ఐపీఎల్‌-2022 మెగా వేలంలో యువ ఆటగాళ్లను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్-2021 సీజన్‌లో తమపై బాగా ఆడిన ముగ్గురు ఆటగాళ్లను చెన్నై కొనుగోలు చేయడం విశేషం. ఇక మార్చి 26 న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనుంది.

శివమ్ దూబే
మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ. 4 కోట్లకు శివమ్ దూబేను కొనుగోలు చేసింది.  దూబే దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తోన్నాడు. కాగా గత ఏడాది సీజన్‌లో రాజస్తాన్‌ తరుపున ఆడిన దుబే అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్‌-2021లో కేవలం 42 బంతుల్లోనే 64 పరుగులు చేసి దూబే తన కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఆడమ్ మిల్నే

మెగా వేలంలో ఆడమ్ మిల్నే ను రూ.1.9 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. ఈ కివీ స్పీడ్‌స్టర్ గత ఏడాది  ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌ సెకెండ్‌ ఫేజ్‌లో చెన్నైపై అద్భుతమైన బౌలింగ్‌ చేశాడు.

క్రిస్ జోర్డాన్
మెగా వేలంలో జోర్డాన్‌ను చెన్నై సూపర్ కింగ్స్   3.6 కోట్లకు కొనుగోలు చేసింది. గత ఏడాది సీజన్‌లో జోర్డాన్ పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. సీఎస్కేతో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో అద్భుతంగా జోర్డాన్‌ రాణించాడు. 4 ఓవర్లు వేసిన జోర్డాన్‌ 20 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.

చదవండి: IPL 2022: ఐపీఎల్‌ ఫ్రాంచైజీలకు భారీ షాక్‌.. 26 మంది స్టార్‌ ఆటగాళ్లు దూరం!

ఇక ఐపీఎల్‌-2022 నేపథ్యంలో సీఎస్కే ఇప్పటికే సూరత్‌లో ప్రాక్టీసు మొదలెట్టిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు