IPL 2022 Eliminator LSG Vs RCB: లక్నో చేసిన తప్పులు ఇవే.. అందుకే ఓడిపోయింది! ఒకవేళ అలా కాకపోయి ఉంటే!

26 May, 2022 13:16 IST|Sakshi
PC: IPL.com

IPL 2022 Eliminator LSG Vs RCB: ఐపీఎల్‌-2022లో కొత్త జట్టుగా ఎంట్రీ ఇచ్చిన కేఎల్‌ రాహుల్‌ నాయకత్వంలోని లక్నో సూపర్‌ జెయింట్స్‌ తనదైన మార్క్‌ను క్రియేట్ చేసుకుంది. టోర్నీ ఆరంభం నుంచే అద్భుతమైన విజయాలు సాధించిన కేఎల్‌ రాహుల్‌ సేన.. టైటిల్‌ రేసులో నిలిచింది.

అయితే ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో అనూహ్యంగా ఓటమి చెందిన లక్నో.. ఈ ఏడాది సీజన్‌లో తమ ప్రయాణాన్ని ముగించింది. అయితే ఈ మ్యాచ్‌లో కొన్ని స్వీయ తప్పిదాల వల్ల ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. అవేంటో ఓ సారి పరీశీలిద్దాం. 

ఫీల్డింగ్‌లో విఫలం
ముఖ్యంగా ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నో ఓటమికి ప్రధాన కారణం ఫీల్డింగ్‌ అనే చెప్పుకోవాలి. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య ఫీల్డింగ్‌లో చాలా వ్యత్యాసం కన్పించింది. ఆర్సీబీ ఫీల్డర్లు 20 నుంచి 30 పరుగుల వరకు కాపాడుకుంటే.. లక్నో ఫీల్డర్లు తమ చెత్త ఫీల్డింగ్‌తో 20 నుంచి 30 పరుగులు అదనంగా సమర్పించుకుంది.

ఇదే విషయాన్ని లక్నో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ కూడా ధృవీకరించాడు. ముఖ్యంగా ఆర్సీబీ బ్యాటింగ్‌ హీరోలు రజత్‌ పాటిదార్‌, దినేష్‌ కార్తీక్‌ల క్యాచ్‌లను వరుస ఓవర్లలో లక్నో ఫీల్డర్లు జారవిడిచారు. ఈ తప్పునకు లక్నో భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది.  వీరిద్దరూ ఐదో వికెట్‌కు 92 పరుగులను జోడించి ఆర్‌సీబీ 207 పరుగుల భారీ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించారు.

డెత్‌ ఓవర్లలో భారీగా పరుగులు
లక్నో ఓటమికి మరో కారణం డెత్‌ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకోవడం. లక్నో బౌలర్లు మ్యాచ్‌ను అద్భుతంగా ఆరంభించారు. తొలి ఓవర్‌లోనే ఆర్సీబీ కెప్టెన్‌ ఫాఫ్ డు ప్లెసిస్‌ను మొహ్సిన్‌ ఖాన్‌ ఔట్‌ చేశాడు. పాటిదార్ ఒక ఎండ్‌లో  అద్భుతంగా ఆడుతున్నప్పటికీ.. కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్ వికెట్లను వరుసగా కోల్పోయింది.

ఈ క్రమంలో 15 ఓవర్లకు లక్నో బౌలర్లు  నాలుగు వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో 170-180 పరుగుల మధ్య ఆర్సీబీ స్కోర్‌ సాధిస్తుందన్న అంచనాలు కనిపించాయి. అయితే డెత్‌ ఓవర్లలో లక్నో బౌలర్లు తేలిపోవడంతో లక్నో బౌలర్లు   207 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఆఖరి ఐదు ఓవర్లలో లక్నో బౌలర్లు 84 పరుగులు సమర్పించుకున్నారుంటే వారి ఆట తీరు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు
208 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన లక్నో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చేసింది. తొలి ఓవర్‌లోనే ఫామ్‌లో ఉన్న డికాక్‌ వికెట్‌ను లక్నో కోల్పోయింది. అనంతరం మనన్ వోహ్రా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే వోహ్రాకు ఈ టోర్న్‌మెంట్‌లో ఇదే తొలి మ్యాచ్‌ కావండంతో ఆరంభంలో కాస్త తడబడ్డాడు. అయితే రెండు సిక్స్‌లు బాదిన తర్వాత వోహ్రా ఔటయ్యాడు.

కాగా పవర్‌ ప్లేలో వికెట్‌ కోల్పోయినప్పడు విధ్వంసకర ఆటగాడు ఎవిన్‌ లూయిస్‌ను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపకుండా, వోహ్రాను పంపి లక్నో  పెద్ద తప్పే చేసింది. ఇక ఈ సీజన్‌లోనే సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన లూయిస్‌ అద్భుతమైన అర్ధసెంచరీ సాధించి లక్నోకు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. అఖరికి హుడా, స్టోయినిష్‌ ఔటయ్యక ఆరో స్థానంలో లూయిస్‌ బ్యాటింగ్‌కు పంపడం దెబ్బతీసిందని చెప్పవచ్చు. ఈ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన లూయిస్‌ 6 బంతుల్లో కేవలం 2 పరగులు మాత్రమే చేశాడు.


చదవండి: Rajat Patidar: ఒత్తిడిలోనూ. వారెవ్వా.. నేను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌: కోహ్లి ప్రశంసలు

Poll
Loading...
మరిన్ని వార్తలు