రిటైర్‌ అవ్వాల్సిన వయసులో ఫుట్‌బాల్‌ క్లబ్‌తో ఒప్పందం

2 Feb, 2023 12:10 IST|Sakshi

55 ఏళ్లు.. మాములుగా అయితే రిటైర్మెంట్‌కు బాగా దగ్గర వయసు. అదే క్రీడల్లో అయితే ఎప్పుడో రిటైర్మెంట్‌ ఇచ్చేవాళ్లు. ఎంత ఫిట్‌గా ఉన్న శరీరం సహకరించకపోవడం వల్ల 40 ఏళ్లు వచ్చేసరికి ఏ క్రీడకు చెందిన ఆటగాళ్లైన రిటైర్మెంట్‌ ఇచ్చేస్తారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫుట్‌బాల్‌ ఆటగాడు మాత్రం అందుకు విరుద్ధం.

జపాన్‌కు చెందిన ఖజుయెషి మియురా(55).. ఫుట్‌బాల్‌ను విపరీతంగా ప్రేమించేవాడు. 55 ఏళ్ల వయసులోనూ కళ్లు చెదిరే ఫిట్‌నెస్‌తో ఒక ఫుట్‌బాల్‌ క్లబ్‌తో ఒప్పందం చేసుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. పోర్చుగల్‌కు చెందిన రెండో డివిజన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ అయిన ఒలివరెన్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇంతకవరకు యొకహమాకు ఎఫ్‌సీ క్లబ్‌కు ఆడిన మియురా ట్రేడింగ్‌లో పోర్చుగీస్‌ క్లబ్‌కు వెళ్లాడు.

గత ఐదు దశాబ్దాలుగా జపాన్‌ తరపున ఫుట్‌బాల్‌ ఆడుతున్న మియురా ఇప్పటికి ఐదు దేశాలకు చెందిన క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ లిస్ట్‌లో బ్రెజిల్‌, జపాన్‌, ఇటలీ, క్రొయేషియా, ఆస్ట్రేలియా ఉన్నాయి. తాజాగా పోర్చుగల్‌ క్లబ్‌కు ఆడనున్న మియురాకు ఇది ఆరో దేశం కానుంది.

మరో విషయం ఏంటంటే.. ఫిబ్రవరి 26తో మియురాకు 56 ఏళ్లు నిండనున్నాయి. ఇదే క్రమంలో మియురా ఒక రికార్డు నెలకొల్పాడు. అదేంటంటే.. ఫుట్‌బాల్‌లో గోల్స్‌ కొట్టిన అతి పెద్ద వయస్కుడిగా నిలిచాడు. ఇంతకముందు తెస్‌పాకుసాత్సు 50 ఏళ్ల 14 రోజులు తొలి స్థానంలో ఉన్నాడు. ఇక మియురా ఇప్పటివరకు జపాన్‌ తరపున 89 మ్యాచ్‌ల్లో 55 గోల్స్‌ కొట్టాడు.

చదవండి: అభిమానులను ఆశ్చర్యపరిచిన 'కింగ్‌' కోహ్లి పోస్ట్‌

మరిన్ని వార్తలు