Sachin Tendulkar: క్రికెట్‌ దేవుడి రిటైర్మెంట్‌కు తొమ్మిదేళ్లు

16 Nov, 2022 18:45 IST|Sakshi

క్రికెట్‌ దేవుడు.. భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ రిటైర్మెంట్‌ ఇచ్చి నవంబర్‌ 16తో తొమ్మిదేళ్లు పూర్తయింది.  ఈ సందర్భంగా బీసీసీఐ సచిన్‌ తన రిటైర్మెంట్‌ రోజున ఇచ్చిన ఎమోషనల్‌ స్పీచ్‌ను మరోసారి షేర్‌ చేసుకుంది. తన 24 ఏళ్ల కెరీర్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సాధించిన రికార్డులను అందుకునే క్రికెటర్‌ ఇప్పట్లో కనిపించడం లేదు. టెస్టు, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సచిన్‌ను కొట్టిన క్రికెటర్‌ ఇప్పటివరకు రాలేదు. కోహ్లి లాంటి గొప్ప క్రికెటర్లు వచ్చినప్పటికి సచిన్‌ వంద సెంచరీల రికార్డు అందుకోవడం కాస్త కష్టమే.

ఇక ఏప్రిల్ 24,1973లో ముంబైలో జన్మించిన సచిన్, 1989లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. టెస్ట్, వన్డే, టీ20 కెరీర్ లో మొత్తం 664 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన సచిన్,  34,357 పరుగులు చేశాడు. అందులో 100 సెంచరీలున్నాయి. ఈ ప్రయాణంలో చెప్పలేని గొప్ప ఇన్నింగ్స్ లు ఎన్నో ఉన్నాయి. ఆస్ట్రేలియాపై ఆడిన 144 ఇన్నింగ్స్ లో 50 సగటుతో 6,707 రన్స్ చేశాడు. అందులో 20 సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియా జట్టుపై ఏ ఆటగాడు ఇన్ని రన్స్ చేయలేదు.

సచిన్ టెండుల్కర్ కెరీల్ లో 1998 ముఖ్యమైన సంవత్సరం. ఆ ఏడాది 42 ఇన్నింగ్స్ లో 68.67 సగటుతో 2541 పరుగులు చేశాడు. అందులో 12 సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ గడ్డలపై టెస్ట్ క్రికెట్ లో 50 యావరేజ్ మెయిన్ టైన్ చేసిన ఆటగాడు సచిన్ ఒక్కడే. 2003లో సౌత్ ఆఫ్రికాలో జరిగిన వరల్డ్ కప్ లో 11 మ్యాచ్ ల్లో 89.25 సగటుతో 673 పరుగులు చేశాడు. 

ఇలాంటి తిరుగులేని క్రికెట్ ఆడిన సచిన్, 2013 నవంబర్ 16న తన హోం గ్రౌండ్ అయిన వాంఖెడే స్టేడియంలో వెస్టిండీస్ తరుపున ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఆడి క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆ మ్యాచ్ లో సచిన్‌ 74 పరుగులు చేశాడు.

చదవండి: 'పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు'

మరిన్ని వార్తలు