సాక్షి, జీవాలతో డ్యాన్స్‌‌ చేసిన ధోనీ

27 Nov, 2020 09:19 IST|Sakshi

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ భార్య సాక్షి, కుమార్తె జీవాతో కలిసి ఓ పార్టీలో డ్యాన్స్ చేశాడు. కుటుంబంతో పాటు వేడుకకు హాజరైన సన్నిహితులతో కలిసి సెప్టులేస్తూ సందడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. "ఇది చూసేటప్పుడు మనం నవ్వకుండా ఉండగలమా? ఖచ్చితంగా కాదు" అని క్యాప్షన్‌ జతచేసింది. ఈ వీడియో ధోని అభిమానులు, నెటిజన్లను ఆకట్టకుంటోంది. కాగా ఈ ఏడాది ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని ఫ్రాంఛైజ్‌ క్రికెట్‌లో కొనసాగతున్న సంగతి తెలిసిందే. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా సీఎస్‌కేకు సారథ్యం వహిస్తునన్న ధోని.. 39 ఏళ్ల ధోని 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు.

కాగా ఐపీఎల్‌ టోర్నమెంట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోనీ ఒకడు. సీఎస్‌కే 2010, 2011, 2018 సీజన్‌లలో మూడు టైటిళ్లను సొంతం చేసుకుంది. 2020 వరకు ఆడిన ప్రతీ సీజన్‌లో దాదాపుగా ప్లేఆఫ్స్‌ చేరుకుంది. కానీ 13వ సీజన్‌లోనే మొదటిసారిగా ప్లేఆఫ్‌ చేరకుండానే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో ధోని రిటైర్‌ అవుతాడంటూ ఊహాగానాలు వినిపించగా.. "పసుపు జెర్సీలో ఈ మ్యాచ్ మీ చివరిది కదా?" అని విలేకరులు అడిగినపప్పుడు "ఖచ్చితంగా కాదు" అని ధోనీ గట్టిగా స్పందించాడు. 204 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ధోనీ 4632 పరుగులు చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు(136.75 స్ట్రైక్ రేట్) ఉన్నాయి. ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాళ్ల స్థానంలో ఎనిమిదో స్థానంలో నిలిచాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా