IPL 2022: "రాహుల్‌ చేసిన అతి పెద్ద తప్పు అదే.. అందుకే లక్నో ఓడిపోయింది"

29 Mar, 2022 13:59 IST|Sakshi
Courtesy: IPL Twitter

IPL 2022: లక్నో సూపర్‌ జెయింట్స్‌  కెప్టెన్‌గా కెఎల్‌ రాహుల్‌ తొలి మ్యాచ్‌ లోనే నిరాశపరిచాడు. ఐపీఎల్‌-2022లో భాగంగా సోమవారం(మార్చి28) గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో లక్నో ఓటమి పాలైంది. అయితే లక్నో తొలి మ్యాచ్‌లోనే ఓటమి చెందడంపై టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాష్‌ చోప్రా స్పందించాడు. రాహుల్‌ తమ జట్టు స్టార్‌ బౌలర్‌ దుష్మంత చమీరతో నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేయించకపోడంపై చోప్రా ఆసంతృప్తి వ్యక్తం చేశాడు.

అదే విధంగా.. చమీర నాలుగు ఓవర్లు వేసి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదని అతడు అభిప్రాయపడ్డాడు. "లక్నో సూపర్‌ జెయింట్స్‌లో చమీరా అత్యుత్తుమ బౌలర్‌. అతడు ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేయలేదు. రాహుల్‌ అతడిని ముందే బౌలింగ్‌కు తీసుకురావల్సింది.

చమీరా తన పేస్‌ బౌలింగ్‌తో రెండు వికెట్లు పడగొట్టి లక్నోకు అద్భుతమైన శుభారంభం ఇచ్చాడు. అటువంటి బౌలర్‌ను రాహుల్‌ నాలుగు ఓవర్లు ఎందుకు పూర్తి చేయించలేదో నాకు అర్ధం కావడం లేదు. రాహుల్‌ చేసిన అతి పెద్ద తప్పిదం అదే. అతడు తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేసి ఉంటే ఫలితం భిన్నంగా ఉండేది" అని ఆకాష్‌ చోప్రా పేర్కొన్నాడు.

చదవండిIPL 2022 SRH VS RR: హెడ్ టూ హెడ్‌ రికార్డ్స్‌ ఎలా ఉన్నాయంటే..!

మరిన్ని వార్తలు