IPL 2022: "పొలార్డ్‌ను పక్కన పెట్టండి.. ఆ యువ ఆటగాడికి అవకాశం ఇవ్వండి"

9 May, 2022 16:49 IST|Sakshi
కీరన్‌ పొలార్డ్‌ (PC: BCCI)

ఐపీఎల్‌-2022లో ముంబై ఇండియన్స్‌ విధ్వంసకర ఆల్‌ రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన పొలార్డ్‌ కేవలం 129 పరుగులు మాత్రమే సాధించాడు. ఇక ఈ ఏడాది సీజన్‌లో ముంబై ఆడునున్న తదుపరి మ్యాచ్‌లకు పొలార్డ్‌ను పక్కన పెట్టి, డెవాల్డ్ బ్రెవిస్‌ను తుది జట్టులోకి తీసుకురావాలని భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా సూచించాడు. 

"వరుస ఓటములతో సతమతమైన ముంబై ఇప్పుడు అద్భుతంగా ఆడుతోంది. అయితే వారి జట్టులో ఒక మార్పు చేయవలసిన సమయం వచ్చింది. కీరన్‌ పొలార్డ్‌ స్థానంలో డెవాల్డ్ బ్రీవిస్ మళ్లీ తిరిగి జట్టులో రావాలి.పొలార్డ్‌కి మీరు ఎన్ని అవకాశాలు ఇస్తారు? అతడు బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమవుతున్నాడు. ఈ పిచ్‌లపై బౌలింగ్‌ పరంగా పర్వాలేదనిపిస్తున్నాడు.. అయితే బౌలర్‌గా అతడిని జట్టులో ఎంపిక చేయడం లేదు కదా. కాబట్టి పొలార్డ్‌కు టాటా బై బై చెప్పే సమయం వచ్చిందని నేను భావిస్తున్నాను"అని ఆకాష్ చోప్రా యూట్యూబ్‌ ఛానల్‌లో పేర్కొన్నాడు. ముంబై తన తదపురి మ్యాచ్‌లో సోమవారం కేకేఆర్‌తో తలపడనుంది.

చదవండి: IPL 2022: ముంబైతో కేకేఆర్‌ ఢీ.. శ్రేయస్‌ సేన ఓడిందా..?

మరిన్ని వార్తలు