-

ఇప్పుడు హసరంగా.. మొన్న హేల్స్‌! ప్రపంచ క్రికెట్‌లో అసలేం జరుగుతోంది?

17 Aug, 2023 12:00 IST|Sakshi

శ్రీలంక స్టార్‌ స్పిన్నర్‌ వనిందు హసరంగా ఇటీవల టెస్టుక్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. వైట్ బాల్ ఫార్మాట్‌లపై దృష్టి సారించేందుకు హసరంగా టెస్టులకు గుడ్‌బై చెప్పాడు. అయితే హసరంగా నిర్ణయాన్ని భారత మాజీ క్రికెటర్‌ ఆకాష్‌ చోప్రా తప్పుబట్టాడు. హసరంగాపై చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు.

"టెస్టు క్రికెట్‌ ఆడడం తనకుకు ఇష్టం లేదని హసరంగా బహిరంగంగా చెప్పాడు. అతడికి కేవలం 26 ఏళ్ల మాత్రమే. ఈ వయస్సులో టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకోవడం సరైన నిర్ణయమా? అలెక్స్ హేల్స్ ఏకంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించేశాడు. అంతకుముందు ట్రెంట్‌ బౌల్ట్‌ న్యూజిలాండ్‌ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ను వదులుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో ఏం జరుగుతోంది? అంటూ చోప్రా తన యూట్యూబ్‌ ఛానల్‌లో ప్రశ్నించాడు.

ఇక హసరంగా వైట్‌బాల్‌ కెరీర్‌ గురించి చోప్రా మాట్లాడుతూ.. అతడు టీ20 క్రికెట్‌లో అద్బుతమైన అనడంలో ఎటువంటి సందేహం లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో శ్రీలంకకు అతడు కీలకం. అయితే టెస్టు క్రికెట్‌లో ఆడకుండా వైట్‌బాల్‌ క్రికెట్‌పై దృష్టిపెడతనడం సరికాదని చెప్పుకొచ్చాడు. ఇక 2020లో దక్షిణాఫ్రికాపై టెస్టు అరంగేట్రం చేసిన వనిందు.. తన కెరీర్‌లో కేవలం 4 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 4 టెస్టుల్లో 196 పరుగులతో పాటు 4 వికెట్లు సాధించాడు. 
చదవండిCPL 2023: విండీస్‌ బ్యాటర్‌ భారీ సిక్సర్‌.. దెబ్బకు పాక్‌ బౌలర్‌ ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు