Aaron Finch: ఆస్ట్రేలియా కెప్టెన్‌ సంచలన నిర్ణయం​.. వన్డేలకు గుడ్‌బై

10 Sep, 2022 08:59 IST|Sakshi

ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ ఆరోన్ ఫించ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు ఫించ్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఈ విషయాన్ని శనివారం విలేకరుల సమావేశంలో ఫించ్‌ వెల్లండించాడు. ఆదివారం కైర్న్స్‌ వేదికగా జరగనున్న మూడో వన్డే ఫించ్ అఖరి వన్డే కానుంది. అతడు టీ20లపై దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

"ఆస్ట్రేలియా వంటి అద్భుతమైన జట్టులో భాగమైనందుకు నేను చాలా అదృష్టవంతుడిని. ఆసీస్‌ జట్టుతో నా జర్నీలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ రోజు వన్డే క్రికెట్‌ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. నా ఈ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన క్రికెట్‌ ఆస్ట్రేలియా, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని ఫించ్‌ పేర్కొన్నాడు.

కాగా గత కొంత కాలంగా వన్డేల్లో ఫించ్‌ దారుణంగా విఫలమవుతున్నాడు. అతడు తన ఏడు వన్డే ఇన్నింగ్స్‌లలో కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. వాటిలో రెండు డకౌట్‌లు కూడా ఉన్నాయి. ఇక ఫించ్‌ 2013 శ్రీలంకపై ఆసీస్‌ తరపున వన్డేల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరపున 145 వన్డేల్లో ప్రాతినిథ్యం వహించిన ఫించ్‌.. 5041 పరుగులు సాధించాడు. 54 వన్డేల్లో ఆసీస్‌ జట్టు కెప్టెన్‌గా ఫించ్‌ వ్యవహారించాడు. అతడి వన్డే కెరీర్‌లో ఇప్పటి వరకు 17 సెంచరీలు, 30 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.


చదవండిAsia Cup 2022: పాక్‌కు షాకిచ్చిన శ్రీలంక​.. 5 వికెట్ల తేడాతో ఘన విజయం

మరిన్ని వార్తలు